పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయా o క ము.

35

 
        వ్వారలు విప్రభక్తి పరి వర్జితు లెన్నడుగారు గావునన్
        బాఱుని బిడ్డ కిచ్చెదవొ ప్రాణము! శాపము నే గ్రహింతువో!! 4

అం:-(తనలో) ఏమీ బెదరింపు; తన బిడ్డను బ్రదికించుకొన లేని
       యీపొఱుడు శాపము నిచ్చునట, ఏమనియో !

వ:- అకాల బాలమరణ దఁడహ్యమానుడవైన యోయదృష్టహీనుడా
      చక్రవర్తిని దూలనాడకుము.

బ్రా: వసిష్ఠులవారా ! దుఃఖమున మునిగిన నేను మిమ్ముఁజూడఁ
      జాలక యపచారమును జేసితిని. నసుస్కారము. శాస్త్ర విహిత
      ముగా రాజ్య మేల జాలని చక్రవర్తిని దూలనాడ కేమి చేయఁ
      గల్గుదును?

శ్రీ:- ఓభూ దేవా ! బ్రాహ్మణ ధర్మముగాని యీయీ కోపమేల పూనెదవు.
      వాటిల్లన యావత్తు సవిస్తరముగా దెల్చిన నదితీర్ప శ్రీరాముడు
      సంసిద్ధముగా నున్నాడు.

బ్రా:ఇతను నాబిడ్డడు, లేక లేక కన్న సంతానము:- నేడకస్మాత్తుగా
     మరణించెను. కారణము మీరే యరయుఁడు.

అం:-(స్మృతి నభినయించి యక్కజ పాటుతో) ఔరా ! యౌరా !
      యేమి యీకుట్ర ! ఏమి యీతంత్రము ! ఏమి యీ ఛద్మ కాశ
     లము! ఇప్పుడంతయు నర్థమయినది; వసిష్ఠుల వారెంత తంత్ర
     జులు మొన్న సాయం కాలము, వసిష్ఠులవారశ్వనీ దేవతలతో
     గుసగుసలు వోవుటకు, గారణమిదియా ! భూ దేవులాకాశ దేవు
    లొక్క టైరి. ఇక శంబుకర్షికి బ్రాణములు దక్కుటెట్లు ! అశ్వనీ
    దేవతల సాహాయ్యమన నీకుర్ర వానిని మూర్ఛపోగొట్టి శంబుకర్షి
    తపఘుచే మరణించెనని చెప్పవచ్చిరి. ఎంత పొఱపాటు: జేసితిని,