పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

శంబు క వ ధ.


       
        వాని మొగము జూచినప్పుడే నాకనుమానము గల్గినది.

అం:-(తనలో) తాతగారూ! నాకు మంచిబిరుదే యిచ్చితిరి. అదియే
        నిజము కానలయు..

శ్రీ:- చిత్తము! మీజ్ఞాబద్ధులము

వ: అటులయినచో రామభద్రా! యిటువినుము, నీవు రాష్ట్రసమా
        చారము లెఱుంగ కుండినను, మేము మాత్రమెఱుఁగకుండఁ జాలము.
       సాకేతపుర రాజ్యశ్రేయస్కాము లమయిన మేము దానిపట్ల బ్రాణ
       ములయిన విడుతుము. నేడయోధ్యా పట్టణ మంతయు గుసగుసల
       తోడను జిటచిటల తోడను నిండి యున్నది.

అం:-(తనలో) ఏమి చెపుమా ! వసిష్ఠు తాత గారి యవ్యాజ పరోప
       కారశీలత వెల్లివిరియు చున్నది.

శ్రీ:- కారణ మేమి ?

వ:-- కారణమా ! ఎన్నడయిన వినియుంటినా శంబుకుని పేరు ?

శ్రీ:- మాకర్ల తాడిత మైనట్లు కన్పట్టదు.

వ: నేఁటిదనుక మేమును వినియుండ లేదు.

వై:-అట్టి యల్పుడే యీ గుసగుసలకన్నిటికిని మూలకారణము .

ప:-ఇతఁడ నార్యుఁడు, అనగా ద్విజేతరుఁడు, అనగా ద్రావిడుఁడు,
     అనఁగా మనస్మృతులు పేర్కొన్న శూద్రుఁడు.

చై:- (సంతోషమునుబట్ట జాలక తనలో) ఆహా! పూర్వసముపార్టీత
      మైన విద్యనంతయు నుపయోగపఱచుచున్న వారు వసిష్టులవారు.
      సమయమున కక్కఱకు రానిచదువు చదువా?

అం:(తనలో) వసిష్ఠుల వారందఱిని గలగూరగంప చేసినారే,

...