పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యాం క ము.

31


 
శ్రీ: అయిన నేమి?

వ: ఏమియు లేదు, శాంతముతో వినుము, త్రికాలజ్ఞులును, లోకా
     తీతులును, బ్రజ్ఞాచక్షువులు నయిన తొల్లింటి ఋషు లెల్ల వీరికి జప
     తపంబులు నిషేధించిది.

శ్రీ:- జపతపంబులనఁగా భగవద్ధ్యాన మేకదా ?

వ:- అగును. భగవద్ధ్యానమే వీరికీ నిషేధించి యార్యులగు ద్విజులకు
     సేవఁ జేయ శాసించిరి.

శ్రీ: ఋషులు మేలు కార్యమునే చేసిరి.

వ:- ఇంతియ కాదు, స్మృత్యను సారముగా వర్ణాశ్రమాచారములను
     నిల్పి కాపాడు భారము కుత్రియులందుంపఁ బడినది. సూర్యవంశ్యు
     లగు కుత్రియు లెల్లరు ఋషుల యాదేశమును గ్రహించి పాటించి
     నేటి దనుక రాజ్య పరిపాలనంబుఁ గావించిరి.

శ్రీ:-నేఁటిదనుక యను చుంటిరి, మేమును మాపూర్వులు పోయిన
     పుంతనే పోవ బద్ధకంకణులము.

వ:-అట్లయిన వినుము, నేఁడీశంబుకుఁడు సాకేతపురమున కతిసా
     మీప్యమున నొకయాశ్రమము నిర్మించి కొని, ద్విజేతరులనుండి
     శిష్యులను గ్రహించి స్మృతులను ధిక్కరించి వారికిఁ దత్వోప దేశ
     ముఁ గావించు చున్నాఁడు. అంతటితో విరమింపక, పట్టణములకును
     బక్కణ సీమలకును ఛాత్రులనంపి యార్యలతో సమాన స్వత్వము
     కలదని శూద్రులకు బోధిం పించుచున్నాడు.

శ్రీ: మాప్రజల కెల్లరకు సమానములగు హక్కులుండ టుచితమే కదా.

వ: ఉచితమే స్మృతి సమ్మతమున్నంత వజకు.