పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము,

29


       తెలిసికొనుటచేఁగల్గిన యగచాట్ల కుందుచే మరల వట్టిపనికి
       బూనుకొనఁడని నాతలంపు,

శ్రీ:- దేశి కేంద్రా ! యకస్మాత్తుగా సంభవించిన భార్యావియోగ
     దుఃఖముచే మతిచెడి రాజు కార్యములయందు బ్రమత్తుడనై
     యున్నాఁడను.


వ:- సూర్యవంశమునం దుద్భవించిన నీవలన నెట్టి మాటలు ఏంటి. నీవు
     ధీరోదాత్తుడవు; ఇట్లు కుందఁదగునా ! యిట్లాడఁ దగునా ? ఎన్ని
     సంకటములు సంభవించినను రాజ ధర్మమును నేఱు వేర్చుటవిధి కాదా?

శ్రీ:-సూర్యవంశపు పరువు మర్యాదలను నిల్పుటకే యి యగచాట్లను
     ధైర్యముతో ననుభవించు చుంటిమి.

వ:-నీవీశ్వరాంశ సంభూతుఁడవు, కానఁ బ్రాకృత జనంబులట్ల మాటాడఁ
     జనదు.ఈ విషయమున వాల్మీక మహాముని యభిప్రాయమును
     వినియుండ లేదా ? ఈశ్వరావతారమని చెప్పుచున్నాడు.

అం:(తనలో) ఇటు వాల్మీక రామాయణమును విన్నాడు; అటుహను
      ద్రామాయణమును విన్నాడు. కాని శ్రీ రామచంద్రుడు తానిం
      కను మనుష్య మాత్రుడో, యీశ్వరుఁడో నిశ్చయించు కొననట్లు
     న్నది. ఒక వేళ రెండునుగాక త్రిశంకు తాత గారి స్వర్గవాసి
     యేమో?

శ్రీ:- దేవా ! క్షమియింపుఁడు. 'మనుష్య రూపము: తోనున్న మేము
      మనుష్యులట్ల చరియింప వలదా ?

ప: శ్రీరామచంద్రా ! నీవు సార్వభౌముఁడవగుటం జేసి రాజధర్మము
     ను విధ్యుక్తముగా వెఱవేర్పవలసి యున్నది

వై :-(తనలో) ఆకోతి ముండ కొడుకేదియో మందు పోసినట్లున్నది.