పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

శంబుక వధ


      యైతివి. లేకున్న నిక్కడి కేలక వచ్చెదవు : దీని కేమిగాని ముక్కు
      మూసి కొని తపము జేసికొను నా బాపనితో రాజ కార్యము లేముం
      డునా యని వెఱుగుపడి యిట్లంటిని.ఇందుఁ దిరస్కరణ మేము
      న్నది . అయినను మనము సామాన్య సేవకులము గదా, మన కేల?
      పోదము రమ్ము. (నిష్క్రమింతురు.)

చై:- (జనాంతికముగా పసిష్ఠునితో) యీ నూతన జాడ్యము కిష్కింధా
      పుర యువరాజునకు గూడ సోకి నట్లున్నది.

వ:- అనుమానముపడియే నేను వానిని నావలకంపు నుపొయముఁ జేసి
      తిని. (శ్రీరామునితో) రామభద్రా ! కర్తవ్యాంశమునకు వత్తము.

శ్రీ:-చిత్తము. గురువుగారి వాక్యములు వినుటకు సిద్ధముగనే యుం
     టిమి. సెలవిండు.

వ:-ఇప్పుడు క్రొత్తక్రొత్తగా బ్రజల యందు రగులు చున్న కలవర
     పాటు నెఱింగితివా ?

చై:-ప్రజలయందుఁ గాదు, ద్విజేతరులయందు.

వ:-ద్విజేతరులయం దేమి ! వారిని సదమదించుటకు ద్విజులయందు
    మాత్రము లేదా ?

శ్రీ:-మేమంతగా నెఱుంగమే. దేవా ! యదియేదియో సెలవిండు.
    (అంగదుఁడు గాంధర్వవిద్యచే బ్రవేశించి యదృశ్యుడై యొక
    మూలడాగి శ్రీరామ వసిష్ఠుల సంభాషణము వినుచుండును.)

వ: శ్రీరామచంద్రా ! రాజనై యుండియు, వేగులవారి మూలమున
    రాష్ట్ర రహస్యములఁ దెలిసికొను చుండుట లేదా ! ఎంతమాట ?

అం:-(తనలో) శ్రీరామచంద్రుఁడు నాడు చాకలివాని యింటిగుబ్బు