పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యాంక ము.

25



శ్రీ: ఓయీ! హనుమం తా ! నీవుసూర్యవంశపు పరువుమర్యాద
         లెఱుఁగనట్లు మాటాడు చున్నావు.

హ:-- ఎఱుంగ కేమి మహత్మా! ప్రాకృతజనంబులాడు మాటలు
        పాటించి వంశము కలంకము పాలగునని తలంచి, నిరపరాధినియు
        సాధ్వీమతల్లియునగు మాయమ్మను హేయమగు నిందపాలు సేయు
       టుచితమో! నేనె ఱుంగనా ! నాఁడశోకవనమధ్యంబున మలిన
       జీర్ణాంబరములతోడను, సంస్కారశూన్యములగుటచే జడలుగట్టిన
       శిరోజములతోడను, దీనా రాత్రములు హా రామ, హా రామ;
       యనుచు మిమ్ముల ధ్యానించుట, అట్టి తల్లికా యిట్టివాదు ?
      త్రేతాయుగలక్షణము కాఁబోలు.

అం:- దేవా ! మేము చెప్పునంతటి వారము కాము గాని సీతామహా
       దేవి వనవాసము చేత సూర్య వంశమున కపకీర్తి గాని కీర్తి రానేరదని
       నాతలంపు.

శ్రీ:- (నిమీలిత నేత్రుడై విచారించి) అంగదా! నీ వాక్యములయందు
       సత్యము లేక పోలేదు. కాని! «జన వాక్యమ్ తు కర్తవ్యమ్" అను
       పల్కులఁ బాటింప వలసిన వాఁడనైతిని.

హ:- దేవా! యీనానుడి మాబోటి ప్రాకృత జనంబులకుఁ గాని
      వంటివారికి గాదు.

శ్రీ: ఆంజ నేయా! నీవు కూడ నానింద మానెత్తి పైనే పడ వేయుచున్న
     వాడవా?

     (ద్వారపాలకుడు ప్రవేశించి, మహాప్రభూ ! వసిష్ఠులవారు
     తమ సందర్శనార్ధమై వచ్చినారు. ఏమి సెలవు ?

శ్రీ:- ఇంతకన్నను గావలసినది యేమున్నది? వెంటనే తోడ్కొని
     రమ్ము,