పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

శంబుకవధ


           వసిష్డు, చైనులు ప్రవేశింతురు. శ్రీరామచంద్రుడు పీఠము
          డిగ్గి సూర్యవంశోద్భవుడును, శిష్యుడునగు రామభద్రుఁడు
          నమస్క రించుచున్న వాడు.

వ,చై- వర్ణాశ్రమాచారపర్కమణసామర్ద్యమస్తు .

హ: రామభద్రుని సేవకుఁడు
         హనుమంతుడు నమస్కరించుచున్నాడు.

వ,చై:--పుత్రపౌత్రాభివృద్ధిరస్తు.

అం:-(తనలో) మా హనుమచ్యు యెంత యదృష్టవంతుడు: పెం
       డ్లియుఁ బెండ్లముకు లేకుండఁగ నే బిడ్డలమీఁద బిడ్డలను బొంద.
      బోవుచున్నాఁడు. ఇందులకు సంశయమేల ! | బ్రాహ్మణులమాట
     రిత్తవోవునా ! (ప్రకాశముగా) కిష్కింధాపుర యువ రాజంగ
     దుఁడు నమస్కరించుచున్నా డు.

వ, వై:-( తేఱి పాజు జూచి యాశీర్వదింతురు.)

శ్రీ:- ఇదిగో ! యిందుదయచేయుఁడు. (అందఱుపనిష్టులగుదురు)

వ:- రామభద్రా ! మనోవ్యాకులము లేకుండ రాజ్యము బరిపాలించు
    చుంటివికదా ! క్రొత్తవింత లేమియు లేవుకదా !

శ్రీ:- మీ యాశీర్వాదబలమువలన ధర్మానుష్టానపరుడనై ప్రజలు
      సంతుష్టి బొందునట్లు రాజ్యము చేయుచునే యుంటిని.జగ
      ద్గురువులయిన మీరు మాయెడఁ బరిపూర్ణకటాక్షముగల్గియుండ
      బాలనయందుఁ గొఱు తేమియుండును ?

2:- దేవా ! సూర్యవంశము సాకేతపుర సింహాసనమునందున్నంత
    కాలము మాబోటి వైదికులకు గోదవలేమియుండవు.

   (అని యాగును)