పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

శం బు క వ ధ.


<poem>> శ్రీ:- ఆంజనేయా! వెర్రి యేడ్పు లేడ్చుచున్నావు. మేము విధించిన

             దండనచే మేము దోషముఁ జేసితిమనియా నీయుద్దేశ్యము

హ: నే ననఁజాలనుగాని, మాయమ్మ మాత్ర మాడండనకు ను

            రాలు కాదని యెఱుంగుదును.

శ్రీ: అయిన మేము దోషముఁ జేసినట్టేక దా! దీని నిదివఱ కేల

            చెప్పకపోతివి.

హ:-- చెప్పనందులకు నామన స్సాక్షి నన్ను బీడించుచు నేయున్నది.

         ఇన్ని దినములనుండి నేను గంటఁగగూర్కెఱుందునా ! 'మొన్న
         యూజగన్మాత స్వప్నమునఁదోఁచి కనుకొలుకుల నుండి వేడికన్నీరు
         కాల్వలై పాఱుచుండఁ గొనగోట జిమ్ముచు డగ్గుత్తికతో “గుమా
        రా ! యక లంకమయిన నాచారిత్రమును, దుర్మార్గులకు దుర్జ్వేయ
        మైన నాపాతివ్రత్యమును, నీ వెఱుంగ వా ? ” యనెను నేనులికిపడి
        తల్లీ ! యెఱుంగ కేమి ? ఈదీనుఁడు మీసన్నిధానమున నిల్చుటక
        యిననర్హుడాయంటిని. అట్లయిన చో శ్రీరామచంద్రునితో జెప్పి
       యేల వారి సంశయములను దీర్పవనియెను, తల్లీ! తల్లీ!! జగ
       న్మాతా !!! నేన సమర్థ డను, నేనసమర్ధుఁడను. అమ్మా ! నేనెవఁ
       డను ! ఆమహాను భావునకు నొక సామాన్య సేవకుఁడను, నామాట
       యందు వారికి గౌరవ మెట్లుదయించు నంటిని ! కుమారా ! నీవు
       చెప్పునదియు నిజమే. రారాని పోరాని యడవులలో బడవలసిన
       యిడుములకు బీతువడను. 'అన్యాయంబుగ నామెడకు దగిలించిన
       యీ “నిరాపనింద” నెట్లు పాపు కొందునా యని దురపిల్లుచుంటిని,
       ఇక నెవరు నాదిక్కు ! మరల మిమ్ముఁ జూడఁ గల్గుదునో లేదోయని
       యంతర్థాన మయ్యెను. నాటనుండి నాకు నిద్రాహారములు రుచిం</poem
       చుట లేదు.