పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

శం బుక వధ.


శం:-- నీ కాయభిప్రాయమున్న నడుగుము.

అం:-చం|| జపము, తపంబు, రెండును ద్విజన్ముల 'వైదిక కర్మముల్ గదా
        నృపతికి వర్ణ ధర్మముల సెల్లను బ్రోచుట ధర్మువంచు ' నె
        ల్లపుడు వచించు చుండునుగ దా!మన శాస్త్రములట్లుగాన,మి
        మిపుడయు పేక్ష సేయగల డే రఘురాముఁడు కంటఁజూచినన్ ?"

శం:__కుమారా ! యంగదా ! నీ సంశయములను దీర్తును గాని మన
         శాస్త్రములను చుంటివి. ఎవ్వరి శాస్త్రములని నీయాశయము ?

అం:-ఆర్యులు చెప్పిన స్మృతులని నా యాశయము.

శం:-- అవ్వి మన వెట్లగును ?

అం:- ఇందు భిన్నాభిప్రాయుఁడను. మన మెట్లు కావో తెలియ
        కుంటిని.

శం:--ఇదిగో ! వినుము. తెలియఁ గలదు.

చం|| ఋషులో మరెవ్వరో పలువు. రెచ్చటనో గుమిగూడి తాముక
        ల్మషమతిఁ బక్షపాతముగ లక్షల గ్రంథము వ్రాయగా నకి
        ల్బిషములటంచు నెత్తిపయి బెట్టుక పూజయొనర్ప నేర్తు మే
        ఋషులకు మాత్రముండవల దే ఋజుమార్గము వాలినందనా !

        ఇట్లు వ్రాయబడిన శాస్త్రములు మన శాస్త్రము లెట్లగును ?
        మనకుఁగా వ్రాసిరా ! మన యభిప్రాయములం గొనిరా ?
        నాఁడు మనమేల వానిచే బుధింపఁ బడవలయు !

ఆం:ఋషులు కల్మషమతిఁ బక్షపాతముగ గ్రంథములు చెప్పిరని
       చెప్పుట సాహసమని యభిప్రాయపడు చున్నాను.

శం: కుమారా ! సాహస మెట్లగును ! పక్షపాతముగ వ్రాసిరో
       లేదో యోజింపుము.