పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

.

ప్ర థ మాంక ము

9


శం: కారణమేమి?

శి:: శ్రీ రామచంద్రుని భగవదవ తారముగా వర్ణింపక యసాధారణ
        మనుష్య మాత్రునిగా వర్తించుట చేనని లోకము చెప్పుకొనుచున్న ది.
        లోకము నోరుమూయించుట కెవ్వరికి సాధ్యము ?

అం:-మంచిపనియే జరిగినది.

శం:- సరే ! నీవుపోయి మన పథకుటీరము తూర్పు వైపు గదిలో దర్భ
       లతో మెత్తని సెజ్జయొనర్చి, వానర రాజునకు గాను వివిధ ఫలముల
       నందుంపుము.

శి:- చిత్తము.

అం:-(తలపంకించుచుఁ దనలో) పారతంత్ర్యమందున్న వారి గతి యిం
       తియేకదా ! (ప్రకాశముగ) దేవా ! మిమ్ముల నొక ప్రశ్న మడుగ
       వలయునను సముత్కంఠయున్నది.మిమ్ములఁ జూచిచూచుట
       తోడనే సర్వశాస్త్ర పారంగతులనియు, నిష్ఠురతపోనిష్ఠాగరిష్ఠులని
       యు, బ్రహ్మజ్ఞానధనులనియు, మాబోంట్లకు దోచకమానదు.
       కాన.....

శం: ఇది కేవలము స్తుతిమాత్రము.

అం—మహనీయులు స్వోత్కర్షవర్ణన విననొల్లరు. మీ కెట్లు దోఁచి
       నను మాకుమాత్రము సత్యము; కావున నాయల్పబుద్ధికి గల్గిన
       శంకనుగూర్చి మిమ్ము ప్రశ్నింప మనంబు వేగిరపడుచున్నది.

శం:—కుమారా ! యాయఖండ జ్ఞానస్వరూపునిముంగల మనమంద
        ఆ మణుమాత్ర పరిజ్ఞానులము. మనయందలి తారతమ్యము కూడ
        సంతియే.

అం:-మీ సౌజన్యము మీమ్ముల నట్లు పలికించు చున్నది.
       యెట్లున్నను నా సందియమును దీర్చుటకు మాత్రము మీరర్హులు.
       ఏది