పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

శంబుక వధ,


      రుణుఁ యమ్మహాజననిఁ జితి నెక్కించి, హవ్యవాహనుని మూలఁ
      బున, నమ్మహా పతివ్రత సాధుశీలమును, నకలంక చారిత్రమును
      నవ్యాజ పతిభక్తియుఁ దానెఱుంగుటయే కాక లోక మెల్ల నెఱింగి
      నను, నిప్పుడిట్టి యకార్యమునుజేయు టేల. కేవలము ప్రజలను
      సంతోష పెట్టుట కేనా ! కుమారా ! యొక్క సంగతి యున్నది.

గీ; పెక్కు జనముల సంతోష పెట్టఁదలఁచు
      వాడొకనినైన సంతోష పఱుప లేక
      తుదకు వ్యర్థ ప్రయత్ను 2 , • దుఃఖభాజు
      నుఁడగు నిరతంబు పెక్కులు , నుడువ నేల?

     శ్రీరామచంద్రుఁ డీయవస్థనే పొందినాడని నాయాశయము.

శి - శిష్యుని ప్రవేశము ) ఇవిగో! పూజాద్రవ్యములు.

శం-ఇటులుంచుము.

శి:- దేవా! యప్పుడే వాల్మీకులవారు రామాయణము వ్రాసికఁట
    శ్రీరామచంద్రుని భగవదవ తారముగాఁకడఁ జేసినారట.

అం:గురుదాసా! కాడనియా నీనమ్మకము?

శి:- కాకేమిగాని, కవీంద్రుని లేఖనిలో నున్న మాహాత్మ్యము మాత్ర
     ము నన్నబ్బురపడఁజేయు చున్నది. కవి లేఖనికి విశ్వామిత్ర సృష్టిఁ
     జేయు శక్తిగలదు.

అం: గురుదాసా ! యేమి నీ యుపాలంభనములు ?

శి:- యువరాజా ! నన్ను బరిహసింపకుము. మన హనుమంతుడు
      కూడ నొక రామాయణము వ్రాసి శ్రీరామచంద్రున కర్పించె
     నట. ఎందు చేతనో కాని దానిని సముద్రమునఁ బాఱ వేయించెనట.