పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథాం కము.

7


        
         ఱేపకడనే పోవచ్చును. సాకేత మిచ్చటకు నతిసామీప్యమున
        నున్నయది.

అం: మీ వాక్యము లే నాకా దేశము.

శం- ఇదిగో! దర్భాసనంబు . ఇటు గూర్చుండుము.

అం: (కూర్చుండి) దేవా ! యక స్మాత్తుగా పట్టాభిరామునకు సంభ
        వించిన యాపత్తు విని సమాశ్వాసింప వానర రాజ్యపట్టభద్రుఁడు
        నన్నంపుచుండె.పెందలకడనే పోయి భార్యా వియోగమున
        గుందుచున్న దాశరథిని నోదార్పవలయు.

శం: అగును. పాపము. తీరరాని యాపత్తే సంభవించినది. చేతు
       లారఁ జేసికొన్న దాని కంతగా దాశరథి చింతింపడు. చింతిల్లఁడు.

శం: చేతులారఁ జేసికొన్న దియే మి!
      శంచేతులారఁ జేసికొన్నది యేమని విస్మయపడుచున్నావు?

ఉ॥ చాకలివాని మాటలు నిజమ్మని నమ్ముచు శంకతాత్ముడై
      యాకమలాయతాక్షిని, సమంచిత సాధ్విని, బూర్జ గర్భణి
      లోకులు నవ్వఁ గారడవిలో వసియింపఁగఁ బంపు టెట్టులో !
      యాకకు నింతయేని నెదు. రాడని తల్లియటంచుఁ గాదొకో. 5

అం: మహాత్మా ! యట్లు కాదు. సూర్యవంశమునందలి సార్వభౌము
       లీగకాలియంతయినఁ గలంకము లేకుండఁ బ్రజాపాలనము గావిం
       చీరట, తద్వంశజాతుఁడయిన శ్రీరామచంద్రుడెట్టి కళంక
       మునకు ననుమానాస్పదు డగుటకు గూడ నోర్వక యిట్లాచరించే
       నట.

శం:-మనము దీని యాథార్థ్యమును శంకింప వలసిన యగత్యము 'లేదు
      కాని నాఁడు రావణసంహారానంతరమున లంకాపట్టణంబున నిష్క