శంబుక వధ
(ఉత్తరరామచరిత)
ప్రథమాంకము
.
-:0:-
(పథశ్రమమున నంగదుఁడు ప్రవేశించును.)
అం:–అబ్బబ్బా! ఎక్కడి కిష్కింధాపురము? ఎక్కడ సాకేతపురము? తుంగభద్రానదినుండి సరయూనదికి రావలయును. వెఱ్ఱికి వేయి విధములన్నట్లు నేనీ కాలినడకను రాబూనుటేల! గాంధర్వ విద్యచే నాకాశగమనంబున రాక తక్కుటేల? ఈ యార్యుల జనపదమ్ముల జూచి మానందింపనలసినది యేమున్నది. వీరి యాచారవ్యవహారములనుజూచి నేర్చేకొనవలసినది యేమున్నది! పర్వతసానువులఁ, బచ్చికపట్టుల, జెట్లతోపుల సడిమినున్న మా పల్లెలే కన్నుల పండువుగ ముద్దులు మూటఁగట్టుచుండును. యార్యుల పేరు గొప్ప యేగాని పరీక్షించిన కొలంది యేదియో సామెత గ్నాపకమునకు వచ్చుచున్నది! (విచారించి) అవురా! యెంత మంచివాడైన నేమి? జాత్యభిమానము వీడదుకదా! కొలది దినముల నుండి మాయం దపనమ్మకము గూడఁ గల్గినట్లున్నది. కారణమో! మేము తమజాతి వారము కామనియా! మేలు! ఏవియో మాయమాటలు చెప్పి, కిష్కింధానగర వానర సామ్రా