పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxvi



కమగు ముద్రా రాక్షసమునను గథానాయిక లేదు. నాటక రచన విషయమున గురు క్షేత్రసంగ్రామము పీఠికలో బయలు పుచ్చిన యభిప్రాయములే యింకను మమ్ము, బాదించుచున్నవి. పద్యము లయందలి గణ యతి ప్రాసము లెట్టి మహాకవి కైనను గొంతపరకం బ్రతిబంధకములని యెల్ల రెరింగినదియే కాన సముచిత పవప్రయో గమున భావప్రకటనముఁ గావించుటకుం గొన్ని యెడల ననువు గల్గదు. అట్టిచో వచనమున కన్న బద్యమునందు నెక్కువ భావ ప్రకటనమునకు నవ కాశముగలదన్న వాద మాదరణీయము గాదు. కాని పద్య నాటకముల యందు సంగీతము ముఖ్యాంగ మగుటఁ జేసి, యయ్యది ప్రేక్షకుల భావగతులను గొంతవరకు లోబఱచు కొని రసో దయమును గావించును అయినను గద్య నాటకముల యందు నభినయ విశేషము చేత స్వరగతి చేతను నీరసోదయమునే కల్పింపవచ్చును. 'పద్యంబునకన్న గవ్యంబు ప్రా కృత జనంబునకు సులభ గ్రాహ్యంబు గానుండును. కాన సంగీత నాటకంబులున్నను, లేకున్నను, వచన నాటకంబులు మాత్ర మత్యవసరము. షేక్సుఫీయర్ పద్య నాటక ప్ర దర్శనము జూచి తలయూచి, యానందించి వచన నాటకముల యంబట్టి భావప్రకట నము సాధ్యమగు నాయని తలంచుట వెఱి. నేడు బెర్నార్డు షా వచన నాటక ములం జూచి మెచ్చని వారెవ్వరు ! ఈమహాకవి నాటకముల ప్రదర్శనమును గాంచు భాగ్య ముమాకుఁగల్గినది. ఒక్కొక్క సందర్భమున మేము తన్మయత్వముఁ బొంది కంటి యెదుట జరుగుచున్నది ప్రదర్శన మనుమాట మఱచితిమి. ఈ మహాకవి రసోచిత పదప్ర యోగ సైపుణ్యమటులుంచి, యిట్టి తన్మయత్వదశను గల్లించిన దెద్దయో యను నది విచారింప పలయును. దీనికిఁ గారణములు బెక్కులు గలవు. అయినను ముఖ్య కారణ ములఁగొన్నింటి నిట నిచ్చుచుంటిమి. ఇందు మొదటిది అభినయము. ఆభినయమనగా జేతులు కాలు కన్నులు కదల్చుటయే కాక , పల్కుచున్న మాటలచే వ్యక్తీ కరింపఁబడు నవస్థాను కూలమగు ముఖ లక్షణకల్పన కూడనగును. ముఖలక్షణముతో పాటు కంఠస్వ రము మార్పు చెంద వలయును. ఇవన్నియు మరల పాత్రోచితముగా మారుచుండ వలయును. అప్పుడే పాత్ర ప్రేక్షకుల మనమాకర్షించి, రసోత్పత్తి కల్గించును. మహా రాణికిని, సామాన్య స్త్రీకిని నొక్క విధమగు నాపద సంభవించినను నిరువురు నొక విధ ముగా శోకింపరు. మహారాణి గుమిలి గుమిలీ పనవును, సామాన్య యో గొంతెత్తి బా వురుమని యేడ్చును.. ఈ భేదము సహజము కాదని యొక రభిప్రాయపడు చున్నారు. వారితో మేమేకీబవింపక పోవుటయే కాక యింక బ్రాపంచిక జ్ఞానము గడియించి కొనిన నట్టి యభిప్రాయమును సవరించు కొందురని నమ్ముచున్నాము.


'పొఠకుడా ! దీర్ఘమగు పీఠికను వ్రాసి విసుగుఁగొల్పి యుందుము, 'మేము వెలి వఱచిన యభిప్రాయములయందు - నేమేని పొరబాటులున్న నవి తెలియఁజే సినయెడల వంధన పూర్వకముగా నంచుకోనుటయే కాక , ద్వితీయ ముద్రణ భాగ్యము లభించిన యెడల సవరించుకొని యెదము, కాని మాత్సర్యగ్రస్థులై వెర్రి విమర్శనలకు దిగు వారి సుడుగులను బెడచెవులం బెట్టెదము.