పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

శంబుక వధ.

<poem

     జ్యమునకు గుండెయు, మా నమ్మిన బంటును, నగు హనుమన్నను
     సాకేత పురమునఁ గట్టివైచెను. ఇప్పుడో! యేదో మిష వెట్టి నన్ను
     రప్పించుచున్నవాడు. దీనినంతయుఁ బరిశీలింప వానర సామ్రా
     జ్యము తన కైవసమున నుంచు కొనుటకు మమ్ములఁ బూటకాపు
     చేసినట్లు తోఁచుచున్నది. మా పూర్వసాహాయ్యమైన దలంపక
     మతమని పేరు చెప్పి క్రమక్రమముగ దినదినము మా స్వాతంత్ర్య
     మును గుంజుకొను చున్నాఁడు. ఎవ్వరును లేరుగదా (యిటునటు
     చూచి)
    గీ! అన్నతోఁ దలపడిపోరి • యాతురమునఁ
    బెజనుగొని తెచ్చి నేలపై   బెట్టు కొనియు
   నకట తప్పించుకొను నుపా • యంబు లేక
    విసుగుపడుచున్న వాడు మా • పిన్న తండ్రి..............1
   సీ. నలుఁడు లేకుండిన • జల రాశి బంధించి
   రావణు లంకకు • రాఁగలండె!
   మందుమాఁకులు తెల్పి, మా తాత ప్రాణముల్
   పోయకున్న నయోధ్య • పోవఁగలఁడె ?
   కపులెల్ల దేశముల్ , గాలింపకుండిన
   దేవి వృత్తాంతంబుఁ • దెలియఁగలఁదె ?
   దోషాచరుల బట్టి • త్రుంపకుండిన మేము
   తొడరి తానొక్కడే • త్రుంప గలడె ?
   వీనినన్నింటి? దలపండు • మానమందు
   వానరుల మమ్ముదనతోడి   వారిగాగ
   నెంచుచున్న వాఁడంట మాకిదియె చాలు
   నంట యడ్డు చెప్పంగరా • దంట సుంత ...................2</poem>