పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XXIV


కాంతేయ మథ్యముండును నపారభుజబల సంపన్నుడయిన భీమున కరణ్య వాసంబున నాంజనేయ సందర్శనంబు లభించె. భాగవతంబున ద్వివిదుడను వానరుని బలరా ముఁడు సంహరించెను. ఆమృత భక్షకులును, సుగ్రీవుని మామలు నై రామరావణ యుద్ధమున సద్వితీయ పౌరుషంబుఁ జూపిన మైందద్వివిదులలో ద్వివిదుండితఁడే, భాగవతంబునఁ గృష్ణ భగవానుఁడు వాసరులయందెల్ల మిగుల వృద్ధుఁడగు జాంబవంతుని నోడించి తత్సుతను 'బెండ్లాడుట మన మెఱుంగుదుము. సీతామహాదేవి జనకుఁడయిన విదేహునియొద్ద బలరాముఁడు తత్వ విద్యనభ్యసించెను. శ్రీరామ చంద్రుని సమకాలి కుఁడయిన పరశురామునకును, భారత ప్రపితామహుఁడయిన భీష్మునకును నెక్కటి కయ్యము సంభవించెను. రాజసూయాస్వర సమయంబున నకులునకు విభీషణుఁడు కానుక లిచ్చెను. రామాయణ కృతికర్త యగు వాల్మీకి ప్రియశిష్యుండైన భరద్వా జుని కుమారుడయిన ద్రోణుఁడు కురుపొండవులగు ధనురాచా చార్యుండయ్యెను. రామాయణ భారత పురుషుల పరస్పర సందర్శనముచే నీ యుద్ధ ద్వయమునకు మధ్య నున్న కాలమత్యల్పమని. యూహింపసగును గాని రామాయణ యుద్ధ కాల నిర్ణయము చేయుటకు మాత్రమయితి కాదు. కాని భారత యుద్ధము మూఁడు నాల్గు వేల సంవత్స రములకు బూర్వము జరిగి యుండునని కొందరి చారిత్రకులభిప్రాయపడుచున్నారు. ఇంతియ 'కాని రామాయణమున నున్న యేయితర యాధారములు 'కాలనిర్ణయమున కను కూల పడవు. ప్రతిపక్ష దేశమయిన సింహళమున నేమయిన నాధారములు దొరకు నేమో చూడవలయును. సింహళ ద్వీపనాస్తవ్యులు హిందువులకన్న నెక్కువ జాగరూక తతో దమ దేశ చరిత్రను వ్రాసి యుంచిరి. సింహళ ద్వీప చరిత్రయగు "రాజావళీ" యను గ్రంథమునందు బుద్ధ దేవుఁడు తన సత్య సందేశమును లోకమునకు వెలిఁబుచ్చు టకుఁ బూర్వము 2000 సం! నాఁడు రాముఁడను నుత్తర హించూ స్థాన వాస్తవ్యుడు సింహళము పై దండెత్తి జయిం చెనని చెప్పంబడి యున్నది. ఆనఁగా సుమారు నాల్గు వేలసంవత్సరములకు మించినది ఇయ్యది రామాయణ భారత యుద్ధముల మధ్య కాలము నత్యల్పవిశ్వసనీయముగా నున్నది. ఇంతకన్నను బలవత్త రమయిన కారణములు సేకరించు వరకు నీ కాలనిర్ణయమే సమంజసమని తోచుచున్నది. నాల్గు వేల సంవత్సర కాలమన్న సొమాన్యము కాదు. పాఠకుఁడా. యింతదనుకే యతి దీర్ఘమయున ,పీఠికను ......చరిత్ర దేశమునకు సంబంధించిన యొకటి రెండు సంగతులు ముచ్చటించి ముగించెదము. .........రామచంద్రుడు తెలుగు దేశమునకు వచ్చెననియు, భద్రాద్రికడనున్న పర్ణ