పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XXIII


రా మా య ణ యుద్ద మె ప్పుడు జ రి గి న ది ?

మస పౌరాణిక కవులు మున్నగు వారు, సార్వభౌములకు, ఋషి సత్తములకు నాయువు నిచ్చుటయందు దాన కర్ణులైరి. ఇంత యుదార స్వభావము మఱి యేయితర దేశకవులయందు గన్పట్టదు. సూర్య వంశ్యులగు రాజులకు వేలకొలది సంవత్సరము లుదానముఁ జేసిరి. వసిష్టాదులగు ఋషులకు బ్రహ్మాయువే యెసంగిరి. ఇంతటితో దనవి ననక విభీమణ హనుమత్ర్పభృతులకు రామనామ మీలోకమునఁ బ్రవర్తించిన యంత కాలము జీవింపుడని వరంబిచ్చిరి. వరంబిచ్చుట యొక యెత్తు. అది చెల్లుట మఱియొక యెత్తుక ! ఇప్పటికిని విభీషణుఁడు పర్వ దినంబుల రామలిం గేశ్వర స్వామినిఁ బూజించి పోవుచునే యుండునఁట. 'కాని మన యదృష్ట హీనమ్మునఁ గన్ను లుండియుఁ గాంచ లేకున్నాము.


ప్రాచీనులు కాలమును నాలుగు యుగములుగా విధజించిరి. అందు మొదటి యుగ మయిన కృత యుగమునకు 1728000 సంవత్సరములు ను రెండవ ముగమయిన త్రేతకు 1296000 వర్షములును, మూఁడవ యుగమయిన ద్వాపరమునకు 864000 హాయ నములును, నాలవ యుగమగు కలియుగమున 482000. యేడ్లును నొసంగిరి. శ్రీరామచంద్రుఁడిందు రెండపముగ మయిన త్రేతా యుగ మహాపు రుషుఁడు. త్రేతా యుగము కట్టకడపట శ్రీరామ చంద్రుఁడు రాజ్యమేలేనని తలంచినను, నిప్పటికి 869000 క్రిండట నున్నాడని స్పష్టపడఁగలదు. ఆనేక కారణములచే నియ్యది యసంభవము గాఁగన్పటుచున్నది. పాఠకుడా యార్షేయములగు గ్రంథము లను ధిక్కరించి ప్రజావిశేషమును జూపించుటకు యత్నించుచున్నారమని భ్రమపడ కుఁడు. ఋషి భక్తియందు 'మేమ్వెరకని దీసిపోము. కాని బహుళ గ్రంథావ లోడన మునఁ గ్రోడీకరించిన కొన్ని సంగతులను నీకు నివేదింతుము గ్రాహ్యంబులయిన గ్రహింపుము, అగ్రాహ్యంబు లని తోఁచినఁ ద్రోసిపుచ్చుము. ఇంతియే మేముగోరునది.


భారత యుద్ధము ద్వాపరాంతమునఁ బ్రవర్తి ల్లేనని హిందువు లెల్లఱుంగుదురని నమ్మెదము. . భారత పురుషులు రామాయణ వీరులను జూచుట తటస్థించటయు నీ రెండు యుద్ధముల మధ్యనున్న 'కాలము లక్షలకొలంది సంవత్సరములు గాక .... మము యుండపలయునని ప్రాగ్నుజులగు విమర్శకులకుఁ దోపకపోదు...... రామాయణ పురుషులుంగల్లిన సందర్శనంబులఁ గొన్నింటిని జూపించెదము. ......