పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxv


శాల ............................ఉష్ణగుండము సీతా మహాదేవి స్నానము చేసిన గుండమనియు నాంధ్రులకు మిగుల నమ్మకమున్నది. ఇది కేవలము చరిత్ర విరుద్దము దశరధునిచే నర్చింపఁబడిన వాఁడై శ్రీరామచండ్రుఁడు గంగానది నుత్తరించి దక్షిణాభి ముఖుఁడై బొంబాయి రాజధానిం జొచ్చి, నాసిక యందు శూర్పణఖా నాసికా విచ్ఛే దనంబాచరించి పదంపడి రావణా పహృత భార్యుఁడై, బళ్ళారియందు సుగ్రీవుని చెల్మిఁజేసి యచ్చటినుండి దక్షిణ ముఖంబుగా బయలు దేరి లంక బ్రవేశించి రావణ సంహారంబు గావించెను. ఇంతీయ కాని భద్రాద్రికి రాను లేదు, వచ్చుటకు నావశ్యకత యును లేదు. పర్ణశాలయు సుష్టగుండమును రామునకు నేమాత్రమును సంబంధించినవి కావు. ఉష్ణగుండము సీతామహాదేవి స్నాన మాచరించుటకు సృషింపఁబడినది కాదు. ఇట్టివి పెక్కు దేశముయందుఁగలవు. Iceland అనుద్వీపమునంచు నాకాశములోనికి నెగయుచుండు తప్తోదకముగల యుష్ణగుండములు పెక్కులుగలవు. ఇంతయేల ? మసహిందూ దేశమునందే బరోడా రాష్ట్రమునందున్న యూగేయను గ్రామమునందు ముష్టగుండములు కలవు. ఇవన్నియు ప్రాకృతిజనంబునకు , లోబఱచు కొనుటకుఁ బన్నిన తంత్రములు. పాఠకులారా ! అభిప్రాయ భేదములను పాటింతురని చెప్పి నిర్భ యముగా మాయభిప్రాయములనన్నిటి మీకు నివేదించితిమి పొరపొటులున్న యెడల నెఱగ జేసిన యుక్త మయినచో దిద్దుకొనుట కేమియు నభ్యంతరము లేమ. ఒక్క రయినను నీగ్రంథము సాంతము గాఁ బరిశీలన బుద్ధితోఁ జదివినయెడల మాశ్రమ వ్యర్దము కాలేదని తలంతుము

. సింహళ ద్వీపచరిత్ర యగు రాజావళి యను మిగుల పురాతన గ్రంధమీ విధముగా వాకనుచున్న ది. “బుద్ధ దేవుఁడు తన సత్య సం దేశమును లోకమునకుఁ జెలియఁజేయు టకు బూర్వము 1844 వత్సరముల క్రిందట శ్రీరామచంద్రుఁడు సింహళము పై దండె త్తెను" బుద్ధ దేవుఁడు క్రీస్తు పుట్టుటకు బూర్వము 526 సంవత్సరముల క్రిందట తనసందేశమును భారతలోకమునకు బోధంచెను. ఆనఁ గా, క్రీస్తు పుట్టుటకు బూర్వము 2370 వర్షముల క్రిందట శ్రీ రామచంద్రుఁడు సింహళము పై దండెత్తెను. ఆనగా నేఁటికి (2370 + 1923) 4292 సంపత్సరముల నాఁడు లంకాపట్టణ జైత్ర. యాత్ర సంభవించెను.

-

నాటక విషయము

శంబుక వధ మతరక్షణాసక్తి ప్రేరితము కాదనియు, రాజనీత ప్రేరితమనియు ? నుత్తర రామాయణముఁ జదివిన వారికెల బోధపడక మానదు. ఈవిషయమందలి 'మా యభి ప్రాయములను నీ నాటకమే చాటుచుండుటం జేసి యిచ్చట వెండియుఁ జెప్పుట యనవసరము. ఈ నాటకమునఁ గథానాయిక లేదు. అనవసరమును, సంబంధము లేని కధానాయిక కనుగొని తెచ్చి వృధానాటకమును బెంచుటకన్న వదలి వేయుట యుత్తమ మని తలపోసి యిట్టారంబించిమి. ఇయ్యది నూతన మార్గము కాదు సంస్కృత నాట