పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XX


నేఁడు నీలుడు వేసిన రాళ్లు, రప్పలు కొట్టికొని పోవుటయే ' కాక, కడలతాకు చే మిగిలిన కట్ట కూడఁ గొట్టుకొని పోయి సముద్రమీవలాపలికి బొరలి పోవుచున్నది. పొరలిపోవుచున్నది సుమీ. పెద్ద పెద్ద నావలు నిరపాయముగా నీ మార్గమునఁ బోవఁజాలవు.


శ్రీమద్రామాయణమునం జెప్పఁబడిన సువేలము త్రికూటము సుమనఃకూటము లంకాద్వీపమున నేటికిని నిలిచియుండి రామజై త్రయాత్రను వేనోళ్ళ జాటు చున్న యవి.


యక్షనాగ లోకము లేవి?


యక్ష శబ్దము సంస్కృతము, దీనికిఁ బ్రాకృతము “ఎక్కులు” తద్భవము (తెలుఁగు) జక్కులు. సింహళ ద్వీపమునందు వాడుకలోనున్న భాష పొళి. ప్రాకృత భాష. కాన సింహళము నందు యక్షులు, “ఎక్కుల” నియుఁ తెలుఁగు దేశము నందు జక్కులనియు బిలువంబడు చున్నారు. సింహళ దేశముయొక్క వాసులు “ఎక్కుల'ని తచ్చరిత్రలు విస్పష్టముగాఁ జెప్పుచున్నవి. రావణుఁడు లంకా ద్వీపముఁ బ్రవేశించి దొమ్మి యుద్ధమున యక్ష రాజయిన కుబేరు నోడిఁచి యుత్తర దిక్కునకు ననగా మలయాలమునకుఁ దోలకమున్ను లంకాద్వీపము యక్ష లోకముగా వ్యవహరింపఁ బడుచుండెను. భారతమున సమయ విరుద్ధముగా ధర్మజ ద్రౌపదీ మందిర ప్రవేశముఁజేయుటచే భూప్రదక్షిణముఁ జేయవలసి వచ్చిన విజయుఁడు (ఆర్జునుఁడు) ప్రభాసతీర్థమున నులూచియను "పాపజవరాలి” చేఁ గొనిపోఁబడెననియు నటనులూ చిన వరించి యినంతుఁడను కుమారునిం బడసెననియు మన మెఱుంగుదుము. ఈ కథనే సింహళ ద్వీపచరిత్రలు మఱియొక విధము గాఁ జెప్పుచున్నవి. విజయుఁడను నుత్త రహిందూస్థాన వాస్తవ్యుఁడు సహచరులతో రొక సరస్తీ రముననుండఁగు వేణి యను నొక యక్షిణి విజయసహచరులను మోసగించు కొనిపోవ నెట్టులో సాధించి : విజయుఁడు కు వేణినిబట్టుకొని చంపఁబోవఁ దన్ను బెండ్లాడిన సహచరులనిత్తునని చెప్పఁగాఁ బెండ్లాడి యనంతరము యక్ష లోకమునంతయు జయించి రాజ్య మేలెనని యు, నీదంపతులకు నొకకుమారుఁడు, కొమార్తెయఁ గల్గిరనియం సింహళ ద్వీప చరిత్రకారులు చెప్పుచున్నారు. ఇచ్చట, హిందూ దేశ చరిత్రకారులు యక్ష నాగలో కములను గలగూరగంపఁ జేసిరని మేమభిప్రాయపడు చుంటిమి. దీనికిఁ దగు కారణము కూడగలదు. సింహళ ద్వీపము యొక్క యుత్తర భాగమును 'నాగ ద్వీపమనియు, నా