పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XXI



గులను నొకని వారచట వాసముఁజేయుచుండిరనియుసింహాళ ద్వీపచరిత్రలవలన దెలియుచున్నది మళయాళ దేశమునందన్న “నాయరు ను జాతి వారచటకు వల సపోయిరనియు, వారలే నాగులైరనియఁ గొందఱు వాదించుచున్నారు. ఈయిరు తెగలయం దాచార సామ్యముకలదు. ఈ భేదము బాగుగా గుర్తెఱుంగని మన గ్రంథ కర్తలు మనము ఇంగ్లీషు " నారిని హూణులను చున్నట్లే యక్షులను నాగులను జేసియుం దురని తలపోయుచున్నాము. ఈ యక్షు లిప్పటికి నీలంకాద్వీపము నందున్నారు. నాగరికత లేని యాటవికులు. వీరలను మేము చూచితిమి. మన కోయ, చెంచు వాండ్ర కన్నను హీనస్థితి యందున్నారు. వీరల నిప్పుడు 'ఎడ్డులనియు, ఎడ్జిమనుష్యుల నియు బిల్చు చుందురు. ఈ రెండు శబ్దములును వ్యాగశబ్ద భవములు మన దేశమునందు న్న జక్కులు వీరికి సంబంధించిన వారేమో చూడ" లసియున్నది. వివాహము లేకుం డుటను బడు పసృత్తికల్గి యుండుటను బట్టి చూడ మాశంక నిజముగు నేమో. యక్షులు వివాహ మెఱుంగరు ఇప్పుడు నాగలోకము లంకోత్తరభూమి యనియు యక్ష లోకము లంక యనియి దెల్లమగు చున్నది. ఈయంశమును విపులముగా జర్చించి పెక్కు దృష్టాంతములు చూపింపవల యనని మనంబున్నను విస్త రభీతి మమ్మందులకుఁ జొరవీ కున్నది.


రాక్షసులు. రావణుడు

వీరార్యులకు బత్యర్ధులు, తమ జన్మ భూమియగు హిందూ దేశమును నార్యులు ప్రవేశించి, యాక్రమించు కొనుటఁజూచి సహింపఁ జాలక వారలను దరిమి వేయుటకు వివిధ ప్రయత్నములు చేసి విఫలీకృత మనోరధులై, విజితులయిరి. వీరు వీర శైవులు. వీర శైవులకు జీవహింస సాంప్రదాయ విరుద్దము. హింసా ప్రపూర్ణములగు యజ్ఞ యాగాదులను వీరందుచేతనే మాన్పించు చుండిరి. అందు రావణుడత్యంత శైవభక్తు డగటంజేసి, యీయాచారమును యాచరణము లోనికిం దెచ్చెను. అందు చేతనే జగత్కంటకుఁడని రామాయణముచేఁ జెప్పించిరి.రావ ణుఁడే పశువదమాన్పుటకుఁ గాను భక్తి ప్రపత్తి పరవశయగు తాటకిని దండ కారణ్య మున నుందుంచెను, ఈతాటకి దండకారణ్యమున విశ్వామిత్ర యజ్ఞ కారిణియగు శ్రీరామచంద్రుఁడు దును మాడుటయు మన మెఱుంగుదుము. తాటకి ప్రపత్తి సప్పుట తిరువడము దూరునందు నీమెకు నింకను దేవాలయమున్న ది. ప్రభాతముననే వనవాటికరిగి, స్వహస్తముతో పుప్పొపచయముఁ గావించి, శివుని సర్పించి అను గూర్చి శివునిక ర్పించుట యీ మేయచారము. శివుఁడీ మె భక్తికి మెచ్చి,