పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XIX


ణునికి భయంపడి యుపనయనాది సంస్కారములను వదలి శూద్రులైపోయిరనుట కన్నబరిహాసమేమి కావలయును? అట్టి వారి సంతానమని చెప్పుకొనుటకయిన సిబ్బితి లేదా ! ఆర్యులకు యజ్ఞోపవీతధారణము మత సంబంధమైన కార్యము వీరియాచార వ్యవహారముల నవలంబించిన దక్షిణాపధమునందున్న బ్రాహ్మణలు, విశ్వబ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, బట్రాజులు సౌలీలు మొదలగు జాతులప్పు డప్పుడు జందెమును మెడకుఁ దగిలించుకొనినవి. నేఁడు కమ్మవారు నిటులే యెజ్ఞో పవీతధరులగు చున్నారు.


లంకా ద్వీపము.

రామాయణ ప్రకారము లంకాద్వీపము హిందూదేశమునకు శతయోజనదూర మందున్నది. యోజనమనగా నేమి ? భాస్కర రామాయణమునందు "యోజన" శబ్దము “అమడ'గా భాషా తరీకరింపఁబడినది . ఈయామడ వెవ్వేరుచోటుల, వెవ్వేరుగా సున్నది. తుదకు " గొందఱెనిమిది మైళ్ళన్నరగా సిద్ధాంతీక రించినారు. దీనిం బట్టిచూడ లంకాద్వీపము హిందూ దేశమునకు నెనిమిదివందల యేఁబది మైళ్ల దూరమునందుండవలయును. కాని యట్లు లేక యిరువదిమూఁడు మైళ్లన్నరలోనున్నది ఈ తారతమ్యమును సమర్థించు టెట్లు ? యోజన శబ్దమునకు వేరేమయిన నర్థమున్న దేమో తెలిసికొనవలసి యున్నది. మహాపండితులను గొందఱి నడిగి యుంటిమి కాని వారు చెప్పిన యర్థములయందొక్కటియు సరిపోవక పోవుటచే నామడయను, సర్థ మే సమంజశమని నిర్దారింపవలసిన వార మైతిమి.ఇంకెట్లు దీనినిసమర్థించుట వాల్మీకి మహా ముని దక్షిణాపధ మెఱుంగని వాఁడగుటచే, వారివలన, వీరివలన విని పొరపడియుండునని చెప్పి రామభక్తులకుఁగోపము రగుల్పవలసివచ్చినందులకు మిగులఁజింతించుచుంటిమి. కడుఁగడుఁ బూర్వకాలమున లంకాద్వీపమునకును హిందూ దేశమునకును మెట్టదారియొకటుండి దాని మూలమున దక్షిణ దేశ పశువులు పుల్లరి మేత కైలంక కుఁబోవుచుం డెననుటకుఁ బెక్కు దృష్టాంతములుకలవు. రామాయణ కాలము నాఁటికి సంతత సముద్రోత్తుంగ తరంగ సంఘట్టితంబగుటచే సింహళమును, నీదేశమును గల్పుచున్న మెట్ట దారియందు గండ్లుపడి యుండెను. నీలుఁడను ద్రావిడశిల్పి వానరుల సాయ్యమునను, శ్రీరామచంద్రుని యాజ్ఞ చేతను కొండశిలలచేసి గండ్ల నే పూడ్చిదారిని బలపరచి భద్రముగా జేసెను. ఇదియే సేతువని జగత్ప్రఖ్యాతి గాంచెను. రామా యణమున నీకథకు వాల్మీకి మహాముని కుంచె కోలతో బెక్కు రంగులు వైచెను,