పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XVIL


ఆర్య బ్రాహ్మణుల నింకను మాంసభక్షణంబు వదల లేదు. వంగ దేశ బ్రా హ్మణులు, నోఁడ్ర బ్రాహ్మణులు మత్స్యభుక్కులు, కనోజీబ్రాహ్మణులు, మహా రాష్ట్రులయందు సారస్వత బ్రాహ్మణులు మాంసాహారులు, పంజాబీ బ్రాహ్మ ణులయందు గొండఱు మాంసాహారులు, వీరందఱును బంచగౌడులలోని వారు. తెలుఁగు దేశమునందుఁ దూర్పుకంసాలులయందు మాంసభక్షణంబు ముసుగులో నున్న యది. ఒక వేళ నిది యోడ్రదేశపు సహవాసదోష మేమో! ఆర్య ద్రావి డ వర్ణవిభాగ మీ దిగువున నుదహరించు చుంటిమి. పాఠకులు జాగరూకులై పరిశీ లింతురుగాక.

అర్యులు. తత్ ధర్మము

1. బ్రాహ్మణులు :- భగవత్పూజావిధానము. (యజ్ఞ యాగాదులు చేయుట
                          చేయించుట)

2. క్షత్రియులు:- పరి పొలన(చాతుర్వర్ణ ధర్మములు సాంకర్యముబొందకుం
                          డఁగా పొడుట)

3. వైశ్యులు:- కృషి వాణిజ్యగోపాలన (ఈమూఁడుజాతులు ద్విజులు)

4. శూద్రులు:- త్రివర్ణిక శుశ్రూష మత సాంఘిక స్వశ్వబహిష్కృతులు .వీరా
                          ర్యులు కారు; పరాభూతులయిన ద్రావిడులు. కావున నే యార్యులకు
                         గ్రహింపఁబడి సేవాధర్మము వీరికి విధింపఁబడెమ. ఇంతియ కాక
                         సేవకులు గ్రహింప బడి సేవా ధార్మము వీరికి విధింప బడెను
                         వర్ణ సొంకర్యమునఁ బుట్టిన వారలుగూడ నిందుఁ జేర్పఁబడిరి.


దావిడులు.



వర్ణ విభాగము

తద్ద్గర్మము

.


1. వెలమ, కమ్మ,
రెడ్డి, కాపు:-- క్షత్రియ ధర్మము. అనఁగా
                                          జీవనము, పరిపాలనము; నేఁడు తెలుగు
                                          దేశమునందున్న జమీలే దీనికి సాక్ష్యము.
                                          వైశ్యధర్మములోఁ గొంత భాగము.--
                                          కృషి, గోపాలనము.

2. గొల్ల, పల్లి, కుమ్మరి, బ్రాహ్మణ ధర్మము .. అనగా దేవరల గుడుల
                                          యందు బూజారి తనము.