పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvi


మైతిమని యానందించుచున్నారు. తమ సంఘము నుండియే, తమ యెదుటనే యార్యమతము స్వీకరించి కొందఱు"బ్రాంహ్మణోనోముఖ హానిన్ "అను పదవిని బొందుటఁజూచి కన్ను గుట్ట మరి కొందరు ద్రావిడాంత శ్శాఖ ఆర్య సంఘముతో నేకీ భవించుటను నహరుహమిక జూడ మొదలిడెను. ఇందు మొదటి వారగు కంసాలులు ! వైధిక బ్రాహ్మణుల దలదన్ని పుట్టినమనియు దామే సద్భ్రాహంణులమనియు వాదించుచు ద్రావిడ నామమును ద్వజించి "విశ్వబ్రాహ్మణ" యను సంస్కృత నామమును వహించిరి. విద్యాహైన్యముచేతను, దారిద్రము చేతను వీరి యభీష్టము కొనసాగమికి మిగుల చింతించు చుంటిమి. మఱియొక యంతశ్శాఖ దేవ బ్రాహ్మణు లైరి. వీరందరిని జూచి చేతిలోని లాభము పోయెనని చెప్పి రేకెత్తి కోమటు లార్య సంఘ ద్వారములను దెఱచి లోనికి బోవ దహతహ లాడు చుండిరి. కోమటిశబ్ద మును దిగదొక్కి "ఆర్యవైశ్యులు" అను సంస్కృతపు పేరు దాల్సి ఆర్యులమను నుకొనుచు దమ స్థితిగతులను బాఱజూచుకొను సరికి బెద్ద యాటంకము పొడజూపి నది. అనుములు, మినుములు, పెసలు, పిప్పళ్ళు గోత్రముల జూచి కొందఱు సంస్కార ప్రియులు కోమటి శబ్దమును "ఆర్యవైశ్య" చేసిన యట్టులీ గోత్రములు సాంకేతికములని జెపి యంగీరస, భరద్వాజ ప్రముఖ బ్రాహ్మణ కు మార్చి వైచికొని యార్య సంఘము నందు జేరుటకు ముస్తీబయి కూరుచుండిరి. దీనినంతయు బరిహాసమునకు వ్రాయుట లేదు. పై పెచ్చు వీరిని సముత్కంఠమున గొనియాడుచుంటిమి. చారిత్రక విషయమగుటచే వ్రాయవలసిన వార మైతిమి. తుదకీ రోగము వెలమ కమ్మవారికిగూడ సోకినట్లున్నది. వీరార్య క్షత్రి యులమను కొను చున్నారు. విస్తరణ భీతిచే నీ యంశమును స్థాలీపులక న్యాయమున జర్చించి క్లుప్తీకరించ వలసిన వారమైతిమి.


ఆంధ్రదేశ మార్య ద్రావిడ నాగరికతా సంఘట్టన స్థానమగుటచేఁ దెలుఁగు జాతులలో కొన్ని సంకరములని చెప్పవచ్చును. ఆర్యమత స్వీకర ముఁజేసి యా ర్యు: లమైతిమని యనుకొను నీదిగువ ద్రావిడ జాతులను బరిశీలించినచో మావాక్యముల యందలి సత్యము మనస్సునకుఁ దట్టకపోదు. ఆరామ ద్రావిడులను, నంబితంబళు లను, 'వైష్వణ, వైదిక నియోగులందు గొందఱిని నఱవకన్నడ బ్రాహ్మణులను బరిశీలించిన యెడల జాతి సాంకర్యము బోధపడక మానదు. 'వెల నాటి పూజారులను గోమటులను, గంసాలులను, జూచిసయెడల నన్యమత స్వీకరణము చేయగల్గిన 'యార్య త్వము విస్పష్టము కాక మానదు,