పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XVIII



3. కోమటి, బలిజ, సాకలి, వెశ్వధర్మములో
మొదలగు జాతులు. నొక భాగమయిన
                                                               వాణిజ్యము

4. తెలగ ( కొసా) బోయ,
చాకలి మొకులగు జాతులు: ! ....................సేవాధర్మము


అంర్యులయందలి వర్ణవిభాగముసందు బ్రాహ్మణులు ప్రథమ స్థాన మలంక రించిరి తదితర జాతులకు బోద్ధలుగా నుండి యన్ని విధములగు హక్కుల సనుభవించు చున్నారు. బాహ్మణ పాదోదదకము పాపహరమనియు, బ్రాహ్మణ భుక్త శేష ము మోక్ష దాయకమనియు, నభిప్రాయముఁ గల్గించిరి. క్షత్రియులు 'రెండవ స్థానమును, వైశ్యులు మూఁడవ స్థానమును, నాక్రమించుకొని యున్నారు. వీరం . దఱు ద్విజులు. ఈ షడ్బేదముతో వీరికి సమానస్వత్వములు గలవు. స్వజాతి వారు కాకపోవుటచే శూద్రులనంబడువారు కొంచెమించుమించుగా బానిసలుగనే యు న్నారు. వీరికున్న హక్కులు నామమాత్రములు.

ద్రావిడ వర్ణ వివక్షతయందు శస్త్రజీవులయిన వెలమ కమ్మ మొదలగు వారగా స్థానమును, వాణిజ్య జీవులగు కోమటులు మొదలగు వారు రెండవ స్థాన ముసు, గొల్ల, కుమ్మరి మొదలగు బ్రాహ్మణ ధర్మాడ్యులు మూఁడవ స్థానము ను బోయ మొదలగు సేవాధర్మపరులు , నాలుగవ స్థానమును గైకొని యుండిరి. ఈవర్ణ వివక్షత కొందఱికి విస్మయజనకము గావచ్చును. కోమటులను వెలమ, కమ్మ వారి తర్వాత విడిచితిమని యార్యవర్ణవిభాగ మెఱింగిన వారనవచ్చును. ఆఱవ దేశము ద్రావిడ దేశమగును. కాన నరవ దేశంబునంచున్న యాచార వ్యవహా రములను బట్టియే వర్జవిభాగమును నిర్ణయింపవలసి యుండును.ఆ దేశంబున వెలమ కమ్మ వారలు కోమటుల యిండ్లకడ పుడిసెలి నీరమయినను ద్రావరు . . ద్రావిడ వర్ణ విభాగంబును దిలకించినయంత వెలమ కమ్మ వారలు క్షత్రియులమనియుఁ గోమటులార్య వైశ్యులమనియుఁ జెప్పు కొనుటకుఁ గల హేతువు సులభైక వేద్యము, వైశ్యధర్మములలో నొకటియగు వాణిజ్యమును బూనిన కోమటులు వైశ్యులమనియు క్షత్రియ ధర్మమయిన శస్త్ర జీవనము దాల్చుటచే వెలమ కమ్మ వారలు క్షత్రియు లమనియు , ననుకొనదొడంగిరి. ఇంతీయ కాని యేపరశురామునినో లేక యే పరశురాముని మగనినో కాంచి బెగ్గిలి యదివఱకున్న జందెములను ద్రెంచివైవలేదు. వీరు బాపని జూచినయంత మాత్రముననే మగబీరమునుడించి మూలముడుంగునంతటి భీరువులు కారు. విక్రమావష్టంభమున దిక్తటముల బీటలు వారించిన వీరు బ్రహ్మ