పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii



యణమునందు రాముని యేక పత్నీ త్వముసకు నసవ సరమయినంత ప్రాముఖ్యత, ఇవ్వ బడినది. తుట్టతుకీ యేక పత్నీత్వమే రాముని నవ తారపురుషునిగా: జేసివైచినది - వైవాహక సముచ్ఛస్థానములంకరించినది. కాని యనులోమ వివాహములు నిరాఘా టముగా జరుగుచునే యున్నవి; ఒక్క వశిస్టుని వంశముఁ దీసికొని విచారించిన యెడల సత్యము బోధపడఁగలదు. వసిష్ఠుఁడు బ్రాహ్మణుడు; భార్య యరుంఢతి మాల; కుమారుడు శక్తి మహాముని, తద్భార్య, పుంగనూరు మాదిగ; శ క్తి మహాముని కుమారుఁడు పళరుఁడు, భార్య బోయ; చాల బ్రాహణ కుటుంబము లటులున్నట్టే పొడఁగట్టుచున్నవి. కాని నేటి బ్రాహ్మణులు బ్రహ్మ ముఖమునుండి యూడిపడితి మను చున్నారు. వంశవృక్షమును బరిశీలించినయెడల నెక్కడనుండి యూడిపడినది తెలియంగలదు. సొంఘిక దౌర్జన్యము మతము నొక మూలకుఁ బారదోలుటచే "నాముష్మిక చింత రెండవది యైనదని చెప్ప సాహసించుచున్నాము. వారి పేరున, వీరి పేరుస, దొంగ స్మృతులు వ్రాయుటిప్పుడే యారంభ మైనది. ఈ వ్రాతలకు ఫలముగా శ్రీరామచంద్రుఁడు “కృశాఁగున్ , నిరాహారున్ శోణజటాచ్ఛటాదరు మహోగ్రచారు నేకాగ్ర తా పారీణాత్ము నధోముఖున్ భసితశుంభ త్ఫాండురశ్రీని థిన్", ధీరత్వాకరు , జీరథారు, దీప్య ర్తప స్సాన్వితున్” ఆయిన శంబుకుని శూద్రుఁడని యనుకంపాశూయుడై, కత్తికి బలియిచ్చెను నేఁటివలె వరుడు వధువునకన్నను పెద్ద వాఁడుగా నుండవలయునను నియమము లేదు; శ్రీరామచంద్రుఁడు సీతామహా దేవికన్నను జిన్న వాఁడు, “పదియే నేఁడుల బాలుఁడు" కాక పక్ష సంయుతుఁడు” ఆగు రాముఁడు తరుణషయస్క యగుసీతను బెండ్లియాడెను. పంజాబు క్షత్రియుల యందమ్మలక్కలిట్టి పెండ్లిడ్లనుబుసుపోకకుఁ జెప్పికొనరు. ఇట్టి వివాహూ మొక్కటి మేమెఱంగుదుము.


ఈ కాలంబున నార్యులు రాజకీయ విషయంబులం దపారవైదగ్ధ్యంబును , గౌశల్యంబును గడించిరి. నయర్త్మమూసనుబడెను, తంత్రము విస్తరించెను; కౌటిల్య మును బ్రకటించి యైన సఖీప్సితంబులఁ బొందుటకు "వెనుదీయరైరి. ఋషులకు గూడ రాజ్యరక్షణమే పరమావది యయ్యెను. ప్రత్యేక వ్యక్తి నశించి యంతయును 'రాజునందు మూర్తి భవించెను. ఈ రాజు" విష్ణుః పృథరీపతి "యయ్యెను. పొట్టకూటికై యార్యులు దేశ భ్రమణంబుమాని పల్లెలంగట్టుకొనిరి. పల్లెలెల్లను బట్టణంబులుగా మారెను. భిన్న రాష్ట్రము లేర్పఱచికొని రాజులు ప్రజానురంజకముగా, నేలుచుండిరి. ' భూమి నదీ ,