పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi


మారామాయణ కాలమున రావణాసురుఁడు వీరి రాజేంద్రుఁడు వీరికీ లంకాపట్ట ణము నుండియ త్రిశిరుఁడు మొదలగు వారలు ప్రతినిధులై దక్షిణాపథమును నేలు చుండిరి. దక్షిణాపధముననున్న యరణ్య సీమశూర్పణఖ కరణము గానిచ్చిన యుద్యాన వాటిక. తిరుచునాపల్లి యియ్యది నిజమని సాక్ష్యమిడుచున్నది. ఈ త్రిశిరుని ద్రావిడ నామము తిరసీరు; ఈతిరుసీరు నే త్రిశిరుని గాఁజేసి సంస్కృత కవులు మనకు వీనిని మూడుతలల వానిగా జూపించిరి. . ఇట్టు లే దళశాస్త్ర నిష్ణాతుఁడయిన దళవదమని బదితలల రావణాసురునిగాఁ జేసియుండిరి. ద్రావిడ శబ్దములను బెక్కిం టిని సంస్కృత శబ్దములు గాఁ జేసియుండి రనుటకుఁ బెక్కుదాహరణములను జూపఁ గలము. దీనిఁగూర్చి వేఱుగ్రంథమునఁ జర్చింపఁదలంచి యిటవిడుచు చున్నారము .


రామాయణ కాలము నాఁటికి నార్యసంఘమునందుఁ బెక్కు మార్పులు గలిగెను . గోమాంభక్షణము త్యజింపఁబడుటయే కాక దూష్యమని కూడ భావింపఁబడ జొచ్చెను కాని మాంస భక్షణంబన్ని కులములయందు దినదినాభివృద్ధి గాంచుచునే యుండెను.మధు సేవజేయఁడు, మాంసంబు ముట్టడు." అను రామా యణ వాక్యము దీనికి సాక్షి భూతమగు చున్నది. కల్మాష పాదునియింట బ్రాహ్మణుం డొక్కఁడు మాంసభక్షణముఁ జేసెనన్న భాగవతి కథ దీనినిబలపఱచు చున్నది. ఇంత యేల కం: “పితృ కార్య యజ్ఞముఖముల శ్రూతచోదిత హింస కీడు చొర నేరచు” అను భారతనీతి యొక్కటియే మా వాక్యములను సిరపఱచును . సోమ పొనంబనుమిషచే గల్లు ద్రాపుట పవిత్ర కార్యముగనే యున్నది. సోమలతరసమయినను, ద్రాక్షారసమయి నసు, దాటిరసమయినను, మద్యములే యగుటంజేసి మాయభిప్రాయమునఁ దుల్య ములే. ఏతత్పూర్వము బహుళ వ్యాప్తిలోనున్న నియోగము గర్హ్యమై, నామమాత్రా పశిష్టము గానున్నది. జిర్ణావస్థలో సున్న యీనియోగమునే వ్యాసభట్టారకుండు పునరుద్ధ రించెను. ఈషణ్మాత్ర భేదముతో " నీనియోగము నేఁటికినీ నోడ్రుల యందున్నది. వేద కాలమునుండి యున్న యనులోమ, విలోమ వివాహములు మాయమై యేక కులమునందే వివాహములు సంభవించు చుండెను. యయాతి దేవయానులీ యాచారమును దిరస్క. రించి పెండ్లి చేసికొనిరి. వారిసంతాసము దూష్యము కాలేదు. బహుపతిత్వము "హేయ ముగాఁ బరిగణింపఁబడుటఁజేసి కాసలమలాడఁజొచ్చెసు, “వ్యాసో నారాయణొ, హరి" కరుణాకటాక్షమునఁ బాండవులు ప్రొవడిన యీయాచారమునకు జీవముఁబోసిరి. బహు పత్నీ త్వము తప్పసు నభిప్రాయమప్పుడప్పుడే మోసు లెత్త సొఁగినది. అందు చేతనే రామా