పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii


మాతృక యగుటం జేసి "ఆకృష పద్యా ఇవ సస్యసంపద” ప్రజలను సంతృప్తులను జేయుచుండెను. జారచోరభీతి లేని రాష్ట్రములు నిత్యకల్యాణము, పచ్చతోరణ ములుగఁ జెలగు చుండెను.


సూర్యవంశ మార్యుల యందు మిగులమన్నింపఁబడుచుండెను. సూర్యవం శ్యులకు సాకేతంబు (ఆయోధ్య) రాజధాని; ఉత్తరహిందూస్థాన మిట్టిస్థితియందుండ శ్రీరా మభద్రుఁడు సౌకలపుర సింహసనాసీను డయ్యెను. స్రాచీన కాలంబున రాజులు దేవునిచే మత ప్రచారంబునకు బంపఁ బడుదురను విశ్వాసముండెము. ఇందుచే రాజ్య తంత్రమునందు మతసంబంధీకులకు నపరి మితాధికారము చేజిక్కెను. దీని ఫలముగా వైదికులు మంత్రులైరి. ఇయ్యది యితరదేశ చరిత్రములయందు నిస్సంశయముగా జూడనగును. రోమక సామ్రాజ్యమున “పో పు "నకున్న సర్వ శాధికారము విస్మయ జనకము; చిర కాలము క్రిందట ఇంగీషు ” రాజ్యమున మతసంబంధికుడయిన “ఛా స్సలరు" ముఖ్యమంత్రి ఆగుటయే గాక యప్రతీ హతాధికారము చెల్లించుకొనెను. ఈవిధముగ శ్రీరామచంద్రునకు.మతగురువగు వశిష్టుని చేతిలో మంత్రులైరి. గురువెట్టి వాఁడయినను గురు తిరష్కారము .శిష్య.ధర్మముకామిచందదకు శ్రీరామచంద్రుడు వశిష్ఠుని చేతిలో కీలు బొమ్మయయ్యెనని చెప్పసొహసించుచున్నాము. ప్రతి పక్షము బలహీనమయిన కొలఁది బ్రాహ్మణులు భూదేవులయిరి. ఆర్య జాతి విజృంభమునందు నీకాలము కృత యుగమని మాయభిప్రాయము. ఈవిషయమున "మేము పూర్వమహా పురుషులనుండి భిన్నల మైతిమని యెఱుంగుదుము. ఇప్పటినుండి యార్యజాతి, పతనమారంభించి భారత యుద్ధముస ముగిసెను ఇందులకే మనము జాగరూకులమై. యాయార్యులచరిత్ర పరిశోధన బుద్ధితోఁ జదివితిమేని, జాతి యొక్క క్రమ క్రమాగతాభివృద్ధి(evolution). స్పష్ట పడును. ఒక కాలమున వివాహము లేకుండ వారు •పుత్రులుంగలుగుటహేయము గాకుండెను. ఇట్టిదిదోష దూషితము గాకుండుటకు గాను నమంత్రక మైన గాంధర్వ వివాహమును నొక్క దానినంగీక రించిరి. "నేటికిని దక్షిణాపధము నందలి యడవి జూతులయందన్న వివాహములలో 'బెక్కులు గాంధర్వ వివాహములే, ఒక కాలమున సంతాన ప్రాప్తికై - "పెర భార్యను దెచ్చుకొనుట "హేయము కాకుండెను. వేఱొక కాలమున 'బహుపత్నీత్వము నింద్యము గాకుండెను.. కొండొక కాలమున బహుపతిత్వము గర్హ్యము గాకుండెను . "కొని విజ్ఞానము వివేకము కన్నులు దెరిచినచిన కొలది యీ యార తారలన్నియు నశించినవి ఇదియే మనమెరుంగ దగినది.


  • సత్యవతి మొదలగు వారు

సంయగుట