పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనగోపాలశతకము

127

పూర్వనీతిశతకకర్తల ధోరణిలో వచించిన నీతులు ఈ శతకమునందును కొన్ని కలవు. భావమును మలచి మలచి వ్యక్తీకరించిన సందర్భములందు దీనిని గమనించవచ్చును. “యథా రాజా తథా ప్రజా" అను సూక్తి “కూతురు ప్రకటించు మాత గుణము" అను నీతి ఈ శతకమున ప్రభువాజ్ఞ కొలదియే ప్రజల మర్యాదలు, మాత తీర్చుకొలది కూతురు నడవళ్ళు' అను భాగము లందు అనుకరణ ప్రాయమై కనిపించును.

అధిక్షేప శతకకర్తలలో కొందరు పురుషుల మనస్తత్వమును విశ్లేషించి సుఖకరమైన సాంసారికజీవనమునకు ఆదర్శదంపతులు మూలస్తంభములవంటివారని ఈ కవి ప్రస్తుతించి దుర్భరజీవనమును గడపువారిని కూర్చి విచారించెను. పరాత్పరుని పాదపంకజముల సేవించి ఆతని అనుగ్రహమునకు నోచుకొనినవారికి పన్నెలదొంతి, వరాలమూట, బంగరుబొమ్మ, గమగమ వలచు చక్కని మల్లెపూచెండు వంటి చెలి లభించుననియు, సుగుణవతి ఇల్లాలుగల పురుషమణిభాగ్యమే భాగ్యమని ప్రస్తుతించెను. గయ్యాళి, టకుబాజి — కల్లరి — తంటాకోరుల వంటి పెండ్లాము నేలుట మగని దౌర్భాగ్యముగ భావించెను. కొన్ని సందర్భములలో వేంకటకవి స్త్రీల ప్రవృత్తిని భర్తృహరి ననుసరించి వివరించెను. చెలియలు పురుషుల చిత్తము హరింతురనియు, ధీరులైన మగవారి మనసు చూరగొందు రనియు, వారి చెలువమునకు తాళజాల రనియు వచించిన సందర్భము లిట్టివి.

సుగుణదుర్గుణములను, సుజనదుర్జనులను తారతమ్యదృష్టితో పరిశీలించుట ఈ శతకములో ప్రత్యేకముగ గమనిపగిన అంశము. భిన్నదృక్పథములను చూపి అధిక్షేపించు విధాన మీ సందర్భములందు చూడవచ్చును. కలియుగమున పదయుగళక్షాళనాభోజికి దురాచారుడై తగు శిరస్నానరతుండు — రణభీరువునకు దారుణచర్యుడై తోచు ప్రబలసంగ్రామప్రవర్తకుండు — అను పద్యములలో ఈ ధోరణి కలదు. అనృతము, సత్యము; పాపపుణ్యకార్యములు; సంధ్యాకర్మసంత్యక్తుడు — యజ్ఞదీక్షాపరుడు; అగ్రహారప్రదాత, క్షేత్రాపహరుడు;