పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

పురుషుని ప్రభావమున పసులకాపరులు ప్రభువులై రనియు, మూలలు, తమ్మళ్ళు, మంగళ్ళు, సంబులు బలు వెజ్జు లైరి అనియు, యుగధర్మములే విస్మయకరములై యున్నవని కవి ఈ అంశములను వివిధోదాహరణములచే సమర్థించెను. ప్రభువుల ప్రసక్తి దుర్గుణ, దుర్జన ప్రస్తావవశమున వచ్చుట గమనింపదగినది. శార్యగుణమున్నచో రణరంగమున చూపవలయు ననియు, ప్రజల బాధించు దుష్టవర్తనుడు సుజనుల కుపకారము చేయలే డనియు, విప్రులమాన్యముల నపహరించువారికి అగ్రహారముల నొసంగువాడు అపకారి అనియు, రణభీరునకు వీరుడు దారుణచర్యుడై తోచుననియు చిత్రవిచిత్రవస్త్రాభరణములే వైభవచిహ్నములు కావనియు నానావిధములుగ పాలకులకు వలయు గుణములను నిర్దేశించెను.

దాన గుణ శౌర్య పౌరుషవిహీనులైన అల్పులకు, అతిశయోక్తులతో వర్ణించు కవులనుకూడ వేంకటకవి ఈ సందర్భమున మందలించెను. కవులు పూజ్యార్హులు, వారికి గల విశిష్ట స్థానమును గుర్తించవలయుననియు సూచించెను. కవి పండితులకు యాచకగుణము, పండితులకు పరస్పరమాత్సర్యము కల్పించనిచో నలువను కీర్తించవచ్చునని భంగ్యంతరముగ కవుల ప్రకృతిని వర్ణించి విమర్శించెను. సుకవిజనముతో పోరాడువారు దుర్గతిని చెందుదురని హెచ్చరించెను.

వివిధనీతులు సాధారణధోరణిలో వివరింపబడినను కొన్ని సందర్భములలో ఖండితదృష్టితో హెచ్చరికల రూపమున నున్నవి. కుటిల చిత్తునకు సద్గోష్ఠి లేదనియు, వచ్చిన అపకీర్తి పోదనియు వచించుట సామాన్యధోరణి — ఉభయసంధ్యల నిద్రించువానికి, బహుగుణాన్వితమైన భార్యను గూడనివారికి లక్ష్మీకటాక్షము లభించదనుటలో, అనయమెచ్చిన్యా నధికార మూడును, ద్రవ్యంబు పెల్ల్లెన ధర్మముడుగు అను సందర్భములందును ' హెచ్చరిక ' తొంగిచూచును — మాన్యములు హరించి ప్రజల పీడించి, బుధుల సొమ్ము హరించినవారికి, కపటప్రవృత్తులుగల వారికి, మృత్యు, పరలోక, యమపురి బాధలను గుర్తింపజేసి హెచ్చరించిన సండర్భములు మరికొన్ని కలవు.