పుట:2015.373190.Athma-Charitramu.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అనుబంధము 639

బాగుగ పని చేయుచున్నది. సగటున 50 మంది స్త్రీలు సభకు వచ్చు చున్నారు. క్రొత్తగా కట్టబడిన సమాజమందిరము మీ రనుకొనునంత చిన్నదికాదు. అది రెండస్తుల చక్కనిమేడ. పై యంతస్తున సుమారు నూఱు స్త్రీలు కూర్చుండవచ్చును. ప్రారంభోత్సవదినమున నిన్నూఱునకు పైగా స్త్రీజనము వచ్చిరి. ఇచట నాభావికార్యక్రమము నేర్పఱుచుకొనుచున్నాను. దైవాను గ్రహమువలన నాకృషి యిచట నుపయుక్తముగ నుండునని యాశించెదను.

కం. వీరేశలింగము.

(16)

సికిందరాబాదు, 29 వ అక్టోబరు 1904

ప్రియసోదరులకు, ఈశ్వరానుగ్రహమున, మీ యీ సోదరుడు కాకినాడవారి కంగీకృత మయ్యెనని రహస్యతంత్రీవార్తలు చెప్పుచున్నవి. ఈ మేలునకు దైవనామము కీర్తింపబడుగాక ! ఇది యింకయు రహస్య వార్తయె.

సుహృదుడు, ర. వెంకటరత్నము.

(17)

రాజమంద్రి, 20 వ మార్చి, 1905

ప్రియమిత్రులకు, "జనానాపత్రికా" వ్యవహారములను గుఱించిన మీ జాబులకు ప్రత్యుత్తర మీయకుండుటకు మిగుల చింతిల్లుచున్నాను. ఈ యశ్రద్ధకు నేను నిందాపాత్రుఁడను. జరిగినదానికి క్షమింప వేడెదను. రెండునెలల పత్రికలు నొకమాఱుగా ముద్రించు నుద్దేశముతో రెండుసారులు నేను "చింతామణీ" కార్యస్థానమునకు