పుట:2015.373190.Athma-Charitramu.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 640

బోయితిని, అరడజనుసారులు గుమాస్తా నంపితిని. ముద్రిత మయిన కొన్నికాకితములు కనబడుట లేదనియు, వానికై వెదకెద మనియు, అచ్చువేయువారు చెప్పుచువచ్చిరేగాని, ఫలితము లేదయ్యెను మద్రాసులో పత్రిక నచ్చొత్తించుడని మీ కంతట వ్రాయనెంచితిని. కాని, యింతలో నేను రోగపీడితుఁడనయితిని. నిస్సత్తువయు కీళ్ల పోటులును నన్ను బాధించెను. అప్పుడు మీ యుత్తరము నా కందినది. రోజుకు రోజు నా జబ్బు ముదిరెను. నా వ్యాధి ప్రబలమై, ఒక పక్షమువఱకును నేను మంచము దిగలేదు. నా తుదిదినము లివియె యని నే దలంచితిని. నాలుగైదు రోజులనుండి మాత్రము తోటలో నిటునటు తిరుగ గలుగు చున్నాను. ఇంకను బలహీనముగ నున్నను, దైవకృపవలన చాల నయముగ నున్నది. కడచిన ఆదివారమున "ప్రార్థన మందిరము"న కృతజ్ఞతాపూర్వకప్రార్థనము నేను జరిపితిని. వ్యాధిప్రథమావస్థలో నేను బ్రాహ్మమతానుష్ఠానము గైకొంటిని.

  • * క్రొత్తచందాదారులపట్టికయు సొమ్మును త్వరలో మీకు బంపెదను. నా యీగొప్పతప్పును సైరింపవలెను.

కం. వీరేశలింగము.

(18)

రాజమంద్రి, 20 వ తేది మే, 1905

ప్రియమిత్రులకు, మీజాబులకును, పంపిన సొమ్మునకును వందనములు. * * శ్రీ పి. రామచంద్రరావుగారు, వారి సతీమణి లక్ష్మీకాంతమ్మగారును నన్నుజూడవచ్చి, నాతోనే యున్నారు. వారు నాయాతిథ్యమున నున్న పుడు, వారి నొంటరిగ వదలి నేనెక్కడ