పుట:2015.373190.Athma-Charitramu.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 638

(13)

"బ్రహ్మకృపా హి కేవలం"

సికిందరాబాదు, 24-8-04

ప్రియసోదరా, "పెద్దగురువు" (వీరేశలింగముపంతులు)కూడ, దరఖాస్తు చేయు మని నాకు వ్రాసిరి. కావున, ఇష్ట మంతగలేకయె, ముఖ్యముగ మిమ్మును వారిని సంతృప్తి పఱచుటకె, ఇపుడె నేను దరఖాస్తు నంపుచున్నాను. * *

మిత్రుఁడు ర. వెంకటరత్నము.

(14)

రాజమంద్రి, 3 వ తేది, సెప్టెంబరు 1904

  • ప్రియమిత్రమా, నేను కాకినాడవెళ్లి, మన మిత్రుని (వెంకటరత్నమునాయుడుగారిని) గుఱించి శాయశక్తుల ప్రయత్నించితిని. నేనచటికిఁబోయిన పిమ్మట జరిగిన పాలకవర్గసభలో, సభికులలో ననేకులు మన స్నేహితుని కాయుద్యోగ మిప్పించుటకు సుముఖులుగ నున్నట్టు గానబడిరి. * * కాని, మమ నేస్తునికి విరోధముగగూడ చాలపని జరుగుచున్నది. తుదకు జయ మెటులుండునో తెలియదు. పరాజితులమె యైనచో, అది మనలోపముచేతకాదు.

కం. వీరేశలింగము.

(15)

రాజమంద్రి, 12 వ సెప్టెంబరు 1904

  • * ప్రియమిత్రులకు, నేను చెన్న పురికి పోవులోపలగా మీరొకసారి యిచటికి రావలయును. ఇక్కడ "స్త్రీపార్థనాసమాజము"