పుట:2015.373190.Athma-Charitramu.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. అకాలమరణము 609

కాల్ధరి భూమిలో నైదుయకరములు నే నీ సంవత్సరము పాలికి కవులిచ్చుటచేత, 1931 వ సంవత్సరము చివర భాగమున రెండు మూఁడు సారులు నేను గుంటూరునుండి బయలుదేఱి యాగ్రామమునకుఁ బోవలసి వచ్చెను. కాని, ఆ భూమిలోని ఫలసాయము నా పయనపు కర్చులకె సరిపోయెను ! ఆర్థికసంబంధ మగు చిక్కులు దేశమం దంతట నలమికొనెను. ఇంటి వ్యయము కొంత తగ్గింప నేను బ్రయత్నించి, సంవత్సరముల నుండి తెప్పించుచుండెడి వార్తాపత్రికలను నే నిపుడు నిలిపివేసితిని.

ఇపుడు గుంటూరునకు వచ్చిన మాలతి "శారదానికేతనము"నఁ జేరి చదువుచు, తన దు:ఖమును గొంత మఱపునకుఁ దెచ్చుకొను చుండెను. ఆ సంవత్స రాంతమున నా భార్యయు మాలతియును "అఖిలభారత మహిళాసభలు" చూచి వచ్చుటకై చెన్నపురి పోయిరి.

1932 వ సంవత్స రారంభమున, గాంధీమహాత్ముఁడు సీమ నుండి వచ్చిన తోడనే, మరల "సత్యాగ్రహోద్యమము" దేశమున ప్రారంభ మయ్యెను. శ్రీ నాగేశ్వరరావుగారు మున్నగు నాంధ్ర ప్రముఖులు మరల కారాగృహములు కేగిరి.

"వీరేశలింగసంస్మృతి" రచియించుసందర్భమున నేను తిరుగవేసిన నాపూర్వదినచర్యపుస్తకములు, పూర్వపత్రికలు, వ్యాసోపన్యాసములును సాయముచేసికొని, నేను 1931 వ సం. సెప్టెంబరు అక్టోబబరునెలలలో నా "ఆత్మచరిత్రము" ను వ్రాయఁదొడంగితిని. అంతకంతకు నాకు దృష్టిమాంద్యము హెచ్చుచుండుటవలన, ఈరచనా కార్యము తృప్తికరముగ సాగలేదు. ఐనను, అక్టోబరునెలలో నేను