పుట:2015.373190.Athma-Charitramu.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. శుభాశుభములు 575

వ్యాసములలో, "ప్రాథమిక పాఠశాలోపాధ్యాయుఁడు," "వీరేశలింగముపంతులుగారు"ను ముఖ్యములు. భావ విస్ఫురణమునందును భాషాసౌష్ఠవమునందును నా శైలి కిటీవలఁ గలిగిన పరిణామ మీ కడపటి యుపన్యాసమునఁ గాన నగును.

ఈ సంవత్సరమున దసరా సెలవులలో నొక పరిచితునితోఁ గూడి నేను నెల్లూరుమండల దక్షిణదిగ్భాగమందలి గ్రామములు కొన్ని చూచివచ్చితిని. చెంగల్పట్టు జిల్లాకుఁ జేరిన గ్రామమైన ఈగాయవారిపాలెపుఁ బ్రజలు తెలుఁగువారె. వీరిలో రాజులు ప్రముఖులు. అచట ఆంధ్రవైష్ణవబ్రాహ్మణులును గలరు. చుట్టు పట్టుల గ్రామములలోఁగూడ నాంధ్రులు గాన వచ్చిరి. ఒక గ్రామ జమీందారు తెలుఁగు బ్రాహ్మణుఁడె.

ఈ సంవత్సరము నూతనముగ బెజవాడలో స్థాపింపఁబడిన "ఆంధ్ర విశ్వవిద్యాలయ" ప్రథమసభ సెప్టెంబరు 9 వ తేదిని జరిగెను. కళాశాలాధ్యక్షుఁడ నగుటచేత నద్దాని సభ్యులలో నే నొకఁడను. ఆ సందర్భమున నేను బెజవాడ పోయి వెనుక నచట నుద్యోగమున నుండు కాలమునాఁటి స్నేహితులను గొందఱిని జూచితిని. ధన్వాడ అనంతముగారు, వారి పెద్ద కుమారుఁడు డాక్టరు రామచంద్రరావుగారును నా కాసభలోఁ గాన వచ్చిరి.

అక్టోబరునెల సెలవులలో నేను గోదావరిజిల్లా పోయి, నరసాపురము భీమవరము గ్రామములలో నుండు సోదరులను తక్కిన బంధువులను జూచితిని. నా భార్యకు మిగుల జబ్బుగ నుండె నని నా కాదినములలో నెల్లూరునుండి తంత్రి వచ్చుటచే నందఱము నలజడి నొందితిమి. తమ్ముఁడు వెంకటరామయ్య, చెల్లెలు కన