పుట:2015.373190.Athma-Charitramu.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 576

కమ్మయును నాతో నపుడు బయలుదేఱి నెల్లూరు వచ్చిరి. మన్యపు జ్వరము మరల తగులుటచేత నాభార్య మిగుల బలహీన యయ్యెనే గాని, ప్రబలమగు వ్యాధి కామె లోను గాలేదని వైద్యుఁడు మాతులుల్లాగారు చెప్పిరి !

గతసంవత్సరము నేను వ్రాసిన "రాజేశ్వరి" డిసెంబరు నెలలో నెల్లూరునందలి ఆంధ్రరంజనీముద్రాలయమునఁ బ్రచుర మయ్యెను. ఇది 'కమలాక్షి' కంటెను జిన్నదగు నవల. వీరేశలింగముపంతులనాఁటి రాజమహేంద్రవరపరిస్థితులు చిత్రించుటయె దీని ముఖ్యోద్దేశము. కథాసంవిధానమందును, రచనాప్రణాళికయందును మంచిమార్పులు కొన్ని సూచించి, యీగ్రంథమునకు రుచిరత నాపాదించిన మదీయమిత్రులు, విమర్శనకళాకుశలులు, బ్ర. శ్రీ. పండిత దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారికి నా కృతజ్ఞతాపూర్వక సమస్కృతు లాచరించితిని.

ఈపుస్తకప్రారంభపుఁ బుటలలో మా చెల్లెలు కామేశ్వరమ్మ చాయాపటమును ముద్రించి, ఆమె కీ కథ నిట్లు కృతి యిచ్చితిని : -

                    తే. గీ. "మాకుఁ గడగొట్టు చెలియలై మహి జనించి
                            వరగుణంబులఁ జెలువారి పరువమునన
                            శిశులతో భర్తతో దివిఁ జేరినసతి
                            కిత్తు నీకృతిఁ బ్రీతిఁ గామేశ్వరికిని"

నెల్లూరు దండువారి వీధిలో మా బస కెదురుగ నొక ప్రాఁత యింట దోరనాల కనకమ్మయును పేద ముసలి వైశ్యవితంతు వుండెడిది. ఆమెకుఁ గల యేకపుత్రికయు, మనుమరాలు నామె కన్నుల యెదుటనే చనిపోయిరి. ఈమె యనుదినమును జాలసేపు మాయిం