పుట:2015.373190.Athma-Charitramu.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 564

ద్రతీరమునఁ గల కొండలవంటి యిసుకదిబ్బలమీఁద నుండి క్రిందికి దొరలుచు మే మమితానంద మందితిమి. మధ్యాహ్న సమయమున మే మొక దోనెలో బకింగుహాము కాలువమీఁద పయనము చేసి, ఆ ప్రాంతమందు పొట్టి యడవియావు లుండెనని విని, వానిని జూచుటకై వనమునఁ దిరిగితిమి. కాని యానాఁడు మాకంటి కా జంతువు లగఁబడలేదు.

ఈ సంవత్సరమున మా తమ్ముఁడు వెంకటరామయ్య మూఁడవ కుమారుఁడు సూర్యనారాయణ వివాహము జరిగెను. మా బావ మఱఁది వెలిచేటి వెంకటరత్నము రెండవకుమార్తె మాలతి నిచ్చి వీనికిఁ బెండ్లి చేసిరి. పెండ్లి నిడదవోలు సత్రములో జరిగెను.

మా తమ్ముఁడు వెంకటరామయ్య నాకు మంచిభూములు కొనిపెట్టుచు వచ్చెను. ఏలూరులోని రామా ముద్రాక్షర శాలాధికారి ఈదర వెంకటరావుగారు, తమ ముద్రాలయమున నా తెలుఁగు పుస్తకములు పునర్ముద్రణము చేయించెద నని కొంతకాలము నుండి నాకుఁ జెప్పుచు వచ్చెను. 1923 వ సంవత్సరము డిశంబరు నెలలో "హిందూ సుందరీమణుల చరిత్రములు" ప్రథమ ద్వితీయ భాగముల పుస్తకముల మూఁడవ కూర్పు నాకొఱకు వారు ముద్రించిరి.

ఆ నెలలోనే కాకినాడ నగరమున దేశీయమహాసభ జరిగెను. మిత్రులు కొండ వెంకటప్పయ్యగారు ఆహ్వానసంఘాధ్యక్షు లగుట చేత సకుటుంబముగ నే నా మహాసభ కేగుటకుఁ బ్రోత్సాహము గలిగెను. అద్దెకు మేము కాకినాడ గాంధీనగరమునఁ బుచ్చుకొనిన కుటీరములో మా తమ్ములు, వారి పిల్లలు, ఇంకఁ బలువురు బంథుమిత్రులును విడిసియుండిరి. ఆదినములలోనె శ్రీ కాశీనాథుని నాగేశ్వర