పుట:2015.373190.Athma-Charitramu.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. కథావిరచనము 565

రావుగారి "భారతీ" పత్రిక వెలువడెను. "చెల్లనునియాత్ర" అను శీర్షికతో నేను చెన్నపురి "స్వరాజ్య" పత్రికలో మహాసభకు సంబంధించిన యాంగ్లవ్యాసములు కొన్ని కథారూపమున వ్రాసితిని. దేశీయమహాసభా సందర్భమున నా కన్నుల నమితముగ నాకర్షించిన మహాపురుషుల జంటలు రెండు గలవు. వీరు వరుసఁగా, తండ్రి కొడుకులగు మోతీలాలు నెహ్రూ జవహరిలాలు నెహ్రూలును, అన్నదమ్ము లగు విటాల్బాయి పఠేలు వల్లభాయి పఠేలును. ఈజంటలలో నొకరి కొకరికిఁ గల తారతమ్యములను నేను వర్ణించితిని.

1924 వ సంవత్సరమున నేను చెన్నపురి విశ్వవిద్యాలయపు సెనెటులో సభ్యుఁడ నైతిని. ఆ యేప్రిలు నెలలో రామా ముద్రాలయమున నా "హిందూసుందరీమణుల"మూఁడవ భాగము ముద్రింపఁబడియెను. ఇ ట్లీ ముద్రాలయమున నా "హిందూసుందరుల"మూఁడు భాగముల పుస్తకములును పునర్ముద్రితము లయ్యెను.

మొదటి కూర్పు పుస్తకములవలెనే యీ క్రొత్తకూర్పు "హిందూసుందరీమణుల చరిత్రములును" మా జనని కివ్విధమునఁ గృతి యిచ్చితిని : -

                     సీ. తనభక్తి కలరి మజ్జనకుండు శ్రీ సుబ్బ
                                  రాయఁ డనూన హర్షమునఁ దేల
                         తన యపారంబగు దయకు నశ్రాంతంబు
                                  తనయులు మిగుల సంతసము నొంద
                         తనసుశీలత బంధుజనుల యుల్లంబుల
                                  లలితమౌ నానందలహరి ముంప
                         తనపూతచరితంబు జనకతమాజాది
                                  వనితల వృత్తంబు ననుకరింప