పుట:2015.373190.Athma-Charitramu.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 560

21 వ సం. ఆగష్టునెలలో శ్రీ వెంకటగిరి రాజాగారి జ్యేష్ఠపుత్రుఁడు శ్రీ కుమారరాజావారి వివాహ మహోత్సవమునకుఁ బిలుపురాఁగా, కొందఱు మిత్రులతోఁ గూడి నేను వెంకటగిరిపోయి, దివాను రాజాచారిగారియింట విడిసి యుంటిని.

ఆనెల చివరభాగమున మోపాడు ప్రాజెక్టులోనుండి నీటి వసతి యేర్పడిన భూములు కొన్ని వేలమునకు రాఁగా, నేను చింతలదేవి పోయి, 31 ఎకరములభూమి కొంటిని. నాలుగైదు వత్సరములలో నీభూమినంతను మాగానిక్రింద మార్పించి, ఎక్కువలాభము నందఁగల నని నే నాశించితిని.

గాంధిమహాత్ముని ప్రేరణమువలన నిపుడారంభమైన సహాయ నిరాకరణోద్యమమునఁ జేరుటకై మా కళాశాలా విద్యార్థులలో నధిక సంచలనము గలిగెను. ఇట్టి రాజకార్యవిషయములలో జోక్యము గలుగఁ జేసికొనవల దని నేను నా విద్యార్థులకు గట్టిగ బోధించితిని.

ఆదసరాసెలవులలో మేము గుంటూరు పోయి, జబ్బుగనుండిన మా తోడియల్లుఁడు సత్తిరాజు వెంకటరత్నమును జూచుటకు ఏలూరు వెళ్లితిమి. మా రెండవతోడియల్లుఁడు పోడూరి కృష్ణమూర్తిగారు కూడ నాసమయమున సకుటుంబముగ నేలూరు వచ్చిరి. అక్టోబరు 9 వ తేదీని వెంకటరత్నము చనిపోయెను. ఇతఁడు ప్రవేశపరీక్ష వఱకు మాత్రమె చదివి, జీవితకాల మంతయు నేఁబది యఱువది రూపాయిల జీతము గల మాధ్యమిక పాఠశాలలో బోధకుఁడుగ నుండినను, స్వయంకృషివలనను, పొదుపరితనముచేతను నెంతయో ధనమును, పలుకుబడిని సంపాదించి, ఏలూరిలోనే తన జీవితమంతయుఁ గడపెను. ఇతఁడు చనిపోయిన మఱునాఁడె వైద్యపరీక్షకై యితని