పుట:2015.373190.Athma-Charitramu.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. దు:ఖోపశమన ప్రయత్నములు (2) 529

గనుఁగొనిరి. నే నీపుస్తకమును మిగుల వినోదమునఁ జదివి స్నేహితులకు, సోదరులకును జదువనిచ్చితిని.

ఫిబ్రవరి 17 వ తేదీని "రామమోహన ధర్మపుస్తకభాండాగారము" న "శిశుశాఖ" నేర్పఱుచుటకై బెజవాడ కేగితిని. 26 వ తేదీని మా కళాశాలలో పెద్దతరగతివారు కళాశాలాధ్యక్షునికి నుపన్యాసకులకును వీడుకోలువిందొనర్చిరి. ఆసభలో బోధకులు బోధితులు నొండొరులనుగూర్చి శ్లాఘనప్రసంగములతోఁ గాలక్షేపము చేసిరి. ఆసమయమున వినువారలతలలు వాఁచునట్టుగ విద్యార్థుల మెప్పువడసినవారము, సత్యనారాయణమూర్తియు నేనును.

ఇటీవల యూరపుఖండమేగి తిరిగివచ్చిన నాపూర్వ శిష్యుఁడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు విదేశమునందలి తమ యనుభవములను గుఱించి 4 వ మార్చిని మాయింట ముచ్చటించిరి. పెక్కులు వినోదాంశము లాతఁడు ప్రస్తావించెను.

దు:ఖోపహతులమగు మేము, వెనుకటివలెఁగాక, యీవేసవిని గుంటూరిలోనె గడుపవలెనని నిశ్చయించుకొంటిమి.

మైసూరు విశ్వవిద్యాలయములో నాంగ్లోపన్యాసకపదవి ఖాళి యయ్యెనని తెలిసి, నేను దరఖాస్తు నంపితిని. కొందఱు స్నేహితులతోఁగలసి నేనంత మద్రాసుపోయి, మైసూరు ఉద్యోగవిషయమున నాకు సాయముగలుగుటకై శ్రీయుతులు నాగేశ్వరరావుగారు భానుమూర్తిగారు మున్నగు మిత్రులద్వారా ప్రయత్నములు చేసితిని. కొన్ని సిఫారసు ఉత్తరములు గైకొని, 16 వ తేదీని నేను బెంగుళూరు పోయితిని. బసవంగుడిలో "అనాధశరణాలయము" ను నడుపుచుండు పరిచితులు వెంకటవరదయ్యంగారు నా కాతిధ్యమొసంగిరి. అచటనే