పుట:2015.373190.Athma-Charitramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. రేలంగి 17

పెదతండ్రికుమారుఁడు కృష్ణమూర్తి, తాటియాకులతో చిన్న బొమ్మలు చేసి, గుడ్డతెర మీఁద వాని నాడించుట మా చిన్నికన్నులకుఁ గడుచోద్యముగ నుండెను!

ఇపుడు నాకు 11 సంవత్సరముల వయస్సు. విద్యాభిరతియు స్నేహాభిలాషయు నాకు మిక్కుటముగ నున్నను, గృహకృత్యనిర్వహణ మనిన నేను బెడమొగము పెట్టువాఁడను కాను. మాతల్లి కడు బలహీనురాలు. కని పెంచెడి పిల్లల సంఖ్య పెరిఁగి కుటుంబభార మధికమైనకొలఁది, ఆమె నిస్సహాయత యినుమడించెను. శైశవదశలో నే నెంత వ్యాధిపీడితుఁడనై జననీజనకుల నలజడిపాలు చేసినను, నాలుగైదేండ్లు వచ్చినప్పటినుండియు శరీరసౌష్ఠవ మేర్పడి, నాయంతట నే నాఁడుకొనుచు వచ్చితి ననియు, తన కమిత సాహాయ్యము చేయుచు వచ్చితి ననియును మా యమ్మ మురియుచుండెడిది. ఆయిల్లా లంతగ గడుసుఁదన మెఱుఁగని పూర్వకాలపు స్త్రీ. కుటుంబనిర్వాహకమునందు తగిన జాగ్రత' లేకుండె నని మొదటిదినములలో మాతండ్రి యామెను బాధించుచుండెడివాఁడట. కాని, నాకు ప్రాజ్ఞత వచ్చినది మొద లాయన యిట్టికార్యములు కట్టిపెట్టవలసివచ్చెను. మా తల్లిని దూషణోక్తు లాడి హింసింపఁబూనునపుడు, నే నాయన తలకెగఁబ్రాకి, జుట్టుపట్టి వంచి, వీపుమీఁదఁ గొట్టుచుండెడి బాల్య దినములు నాకు బాగుగ జ్ఞాపకము. రేలంగి కాపురఁపు తుది దినములలో మాతల్లి సంతానము నలుగురు కుమారులు నొకకొమార్తెయు. మా జనని యొక్కతెయె యింటిపనులు జరుపుకొనవలసివచ్చెడిది. తల్లి కష్టము లూరక చూచుచుండనొల్లక, నే నామెకుఁ దోడుపడెడివాఁడను. పాఠశాలనుండి వచ్చినతోడనే, పుస్తకము లొకమూల వైచి, కాలు సేతులు గడిగికొని, ఏడ్చెడి శిశువు నెత్తికొని యాడించుచు, నే నామెకు