పుట:2015.373190.Athma-Charitramu.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 506

సందర్శించితిని. అదిబ్రాహ్మసమాజమువారి పెద్ద సభకు కుటుంబ సహితముగ నేను బోయితిని. ఆ సమయమున శ్రీ రవీంధ్రనాధ తాకూరు కవి గొప్ప ప్రసంగము చేసెను. వారి సోదరు లిరువురును గూడ నా సభలో పాల్గొనిరి. నేను ఆ ఫిబ్రవరి 6-17 వతేదీల స్టాండర్డు పత్రికలలో, "బ్రాహ్మసమాజము"ను గుఱించిన వ్యాసములు వ్రాసితిని. బంగాళములో బ్రాహ్మసమాజము మూఁడుశాఖలై యున్నది. "ఆది బ్రాహ్మసమాజము" న కిప్పుడు తాగూరువంశము వారె పట్టుఁగొమ్మ ! మహర్షి దేవేంద్రనాధతాగూరుగారును, నారి తనయులును బ్రాహ్మసమాజము నుద్ధరించిన మహనీయులు. తాగూరు వంశము ప్రతిభాశాలుల వంశము. బ్రాహ్మసమాజస్థాపకులగు రాజారామమోహనరాయల పిమ్మట, ఆసమాజమును భరతదేశమునఁ బునరుద్ధరించినవారు దేవేంద్రనాధతాగూరుగారు. తమ యపార దైవభక్తి ప్రభావమువలన వీరు 'మహర్షి' యను గౌరవ నామమును గాంచిరి. వీరి కుమారరత్నమె ప్రస్తుతమున భారతదేశ కవి సార్వభౌము లగు రవీంద్రనాధ తాగూరుగారు. కవులు లేని మత సంస్థ యభ్యున్నతి గాంచనేరదు. భారత కవిపుంగవు లగు రవీంద్రుఁడు బ్రాహ్మసమాజకవియె. వీరి సోదరులగు ద్విజేంద్ర సత్యేంద్ర నాధులును మహిమాన్వితులె.

బ్రాహ్మసమాజస్థాపకులలో మూఁడవవాఁడగు కేశవచంద్రసేనుల వారు బ్రాహ్మమతమునకు సాంఘికత్వమును నెలకొల్పి, బ్రాహ్మ సమాజము నొక సంఘముగ స్థాపించినవారు. వీరు తమ గురువులగు దేవేంద్రనాధునుండి చీలిపోయి, "నవవిధాన సమాజము" నేర్పఱిచిరి. ఈ సమాజములో నుండు కేశవచంద్రుని సహచరులు భగవద్ధ్యాన పరాయణు లని పేరు వడసిరి.