పుట:2015.373190.Athma-Charitramu.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. "చెన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు" 507

మూఁడవ శాఖ యగు "సాధారణ బ్రాహ్మసమాజము" నకు పండిత శివనాథ శాస్త్రిగారును, వారి యనుచరులును స్థాపకులు. "ఆదిబ్రాహ్మసమాజము" ప్రాచీన సంప్రదాయములకును, "నవవిధానసమాజము" భావవైశాల్యమునకును బ్రఖ్యాతినొందెను. తక్కిన రెండు శాఖలకంటెను, ఈశాఖ యధిక సంఖ్యాకు లగు సభ్యులతో నలరారుచున్నది.

నేనంతట బ్రాహ్మసమాజమువారి మాఘోత్సవములను వర్ణించితిని. శాక్తేయ చైతన్యవైష్ణవమతములలోనుండి బంగాళాములో ప్రభవించిన బ్రాహ్మమతమునకు, ప్రాచీనమతములలో నుత్తమధర్మము లంతట సంక్రమింపఁగా, దేశారిష్టకములగు విగ్రహారాధన, జాతివిభేదములు, రాణివాసము మున్నగు నాచారమునతో నది పోరుసాగించెను. కాని, బ్రాహ్మమతము సాధించిన మేలంతయు బ్రాహ్మసమాజము వారె యనుభవించుచుండుట లేదు. ఆ సమాజములోకంటె వెలుపలనే యెక్కువమంది బ్రాహ్మమతస్థులు గల రనవచ్చును. హిందూమతము నచ్చకుండెడి వందలకొలఁది యువకులకు, ప్రతియాదివారమును జరుగు బ్రాహ్మసమాజారాధనయె యాదరవగుచున్నది. సాంఘిక విషయములందుఁగూడ బ్రాహ్మసమాజము జనుల కాదర్శమయ్యెను. కాని, యిది కారణముగ బ్రాహ్మమతస్థుఁడు విఱ్ఱవీఁగుటలేదు. అతనిలోపము లాతనికి బాగుగ గ్రాహ్యమె. ఏమికారణముననో కాని, ప్రస్తుతమున సమాజమందలి యువకుల కనేకులకు బ్రాహ్మమతమం దంతగ నభిమానము లేకున్నది. ఇదిగాక, బ్రహ్మమతమునకు మాతృమతమునం దంతగ భక్తిలేనట్టుగ నున్నది. ఇదివఱకే శాఖలక్రిందను, జాతుల క్రిందను చీలిపోయిన హిందూసంఘమున కీక్రొత్తశాఖయగు బ్రాహ్మ సమాజమువలనఁగూడ చెడుగురాదని యెవరు చెప్పఁగలరు? భోజనాది