పుట:2015.373190.Athma-Charitramu.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 492

ఎండ లతి తీవ్రముగ నుండుటచేతను, మంచి పాలదాది యేలూరులో కుదురుటచేతను, మేమచటనే యొకనెల యుంటిమి. పిమ్మట నరసాపురమున వొక నెల గడపి, జూనునెల తుదిని గుంటూరు వచ్చితిమి. ఒకసంవత్సరము దాటినఁగాని పిల్లవాఁడు మెడలు నిలుపనేలేదు. తెలివితేటలందుమాత్రము వాఁడు దినదినాభివృద్ధి నొందుచుండెను.

ఈ వేసవికాలమున నిడదవోలులో మహాసభ లెన్నియో కూడెను. చెల్లెలు చనిపోయినప్పటినుండియు సభలు, సమావేశములును నా కేమియు రుచింపకుండినను, సంఘసంస్కరణసభలో శ్రీమతి ఆచంట రుక్మిణమ్మగారు చేసిన యాంగ్లోపన్యాసమును తెలుఁగు చేసి చెప్పితిని. సభలకు విచ్చేసిన ప్రాఁతమిత్రు లనేకులు నాకుఁ గానఁబడిరి. శ్రీయుత కొండ వెంకటప్పయ్యగారు తా మిటీవల కొనిన వేఁటపాలెముతోఁటలో "శారదానికేతన" మను పేర నొక స్త్రీ గురుకులాశ్రమమును స్థాపించుటనుగుఱించి స్నేహితులతో నపుడు మాటాడిరి. స్త్రీవిద్యాభివృద్ధికై చాలకాలము పరిశ్రమచేసిన నేనె యీ స్త్రీసంస్థను జరుపుట యుక్తమని పలువు రనిరి. ఒక సంవత్సరము గుంటూరికళాశాలలో సెలవు పుచ్చుకొని, జీతము గైకొనక యీ యువతీ విద్యాలయమును నడపుదు ననియు, అప్పటి ఫలితములను జూచి నాముందరి ప్రణాళిక నేర్పఱుచుకొందు ననియును నేను బ్రత్యుత్తర మిచ్చితిని. తోడనే యొకసారిగ నేను నాయుద్యోగమును విరమించుకొని, "శారదానికేతన" యాజమాన్యమును స్వీకరింపవలె నని నామిత్రు లనిరి. నే నట్లు చేయఁజాల నని చెప్పివేసితిని.

ఇంతలో మా కింకొకకష్టము సంప్రాప్త మయ్యెను ! చనిపోయిన మాచెల్లెలి పెద్దపిల్లవాఁడు, ఆసంవత్సరము జూలై నెలలో నాక