పుట:2015.373190.Athma-Charitramu.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. చెల్లెలి మరణము 493

స్మికముగ మృతినొందెనని తెలిసెను. వీఁడు మొదటినుండియు నారోగ్యవంతుఁడె. తల్లిచనిపోయినపుడు, తండ్రి వానిని స్వగ్రామమునకుఁ గొనిపోయెను. ఇటీవల నేనచటికిఁ బోయి చూచినపుడు, వాఁడు చక్కఁగ నుండెను. వీని చావు మమ్మందఱిని దు:ఖపరవశులఁ జేసెను. ఆకష్టసమయమున మాతమ్ముఁడు, చెల్లెలును నా కిట్లు వ్రాసిరి.

9 ఆగష్టు 1912, శుక్రవారము, ఆర్తమూరు.

""అన్నయ్యా,

5 వ తేదీని నీవువ్రాసిన కార్డు చూచి దు:ఖసముద్రములో మునిఁగితిని. కాని మనవంటి నిర్భాగ్యులకు విచారించుటకూడ చాల సిగ్గు. మనచెల్లెలు ధన్యూరాలని యిపుడు తలంచితిని. ఇదివఱకు జరిగిన దానికి విచారించనా, దీనికి విచారించనా ? ముందుకూడ ఇట్టిబాధలే అనుభవింతుము.

"చంటిపిల్ల వాడుకూడ మనకు ఋణసంబంధమె అని తలంచెదను. అయినను మన మేమిచేయగలము ? సౌ. పెద్దవదెన నీవును చాలప్రేమచేత విధికార్యము నెరవేర్చుకొనుచున్నారు. దైవాధీనము తెలియదు...అన్నయ్యా, ధైర్యముగా ఉండు. మనకును ఇక్కడ శాశ్వతం లేదు...నీమనస్సును పాడుచేసుకోవద్దు.

పులుగుర్తు కనకమ్మ"

నరసాపురము, 6 - 8 - 12

"అన్నయ్యకు,

మనచెల్లెలు కామేశ్వరమ్మ పెద్దకుమారుడు విశ్వనాధము చనిపోయెనని తెలుపు అట్లపాడు ఉత్తరము చదువగానె, నామనసు నీరైపోయెను ! కొన్ని నెలల క్రిందట నేనాగ్రామము వెళ్లినపుడు,