పుట:2015.373190.Athma-Charitramu.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. ఉద్యోగప్రయత్నములు 485

వాదివృత్తిని ఏలూరున 'గాలి' జీవనము చేయుచుండెను గావున, అతనికే యీయుద్యోగ మగుట శ్రేయము కదా యని వారు నాతోననిరి. నాస్నేహితుని కీయుద్యోగము లభించుట నాకు నభిమతమే యని నేను జెప్పివేసితిని. అంత కనకరాజునకీ యుద్యోగ మయ్యెనని కొలఁదిరోజులకె తెలిసెను.

1910 వ సంవత్సరము మేనెలలో గుంటూరున జరిగిన మండల సంఘ సంస్కరణసభకు శ్రీ వింజమూరి భావనాచార్యులుగారు అగ్రాసనాధిపతులు. నేను ఆహ్వాన సంఘాధ్యక్షుఁడను. పండ్రెండు సంవత్సరముల క్రిందట నీ పురమున జరిగిన మండల సంఘసంస్కరణ సభలో వితంతూద్వాహమును గూర్చిన తీర్మానము ప్రజాసమ్మతము గాకుండుటయును, అతి బాల్యవివాహనిషేధమును గుఱించిన తీర్మానమున కంతరాయము గలుగ సిద్ధ మగుటయుఁ దలపోసినచో, ఇంత స్వల్పకాలమున నీ మండలమందలి సాంఘిక వాతావరణము సంస్కరణానుకూలముగ మాఱుటకు నే నెంతయు సంతసించితిని.

రాఁబోవు సంవత్సరప్రారంభమున గుంటూరున "విద్యావిషయక ప్రదర్శనము" జరిపింప నొక సమాజము 1910 వ సంవత్సరమున స్థాపిత మయ్యెను. దానికి పాఠశాలా పరీక్షాధికారులు సుబ్బరాయశాస్త్రిగారు అధ్యక్షులు. మువ్వురు కార్యదర్శులలో నేనొకఁడను. కార్యభారము తొలఁగించుకొన నే నెంత మొదట వాంఛించినను, అందఱికంటె నెక్కువగ నేనే పరిశ్రమింపవలసివచ్చెను.

కురుపాంరాజాగారగు శ్రీ వీరభద్రరాజాగారికి అంతరంగిక కార్యదర్శి కావలె నని తెలిసి నే నాయుద్యోగమునకుఁ బ్రయత్నించితిని. నే నాడిసెంబరులో మాతమ్మునితో వాల్తేరు వెళ్లి, రాజావారి