పుట:2015.373190.Athma-Charitramu.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 486

దర్శనము చేసితిని. వారి యాంతరంగిక కార్యదర్శియె చట్టనిర్మాణ సభలో సభ్యులగు రాజాగారికిఁ గావలసినపనులు, సంస్థానపుఁబనులు తదితర విధులును చేయవలెననిరి. జీతము నూటయేఁబది రూపాయిలు తమతో నింగ్లండు పోవలెననియుఁ జెప్పిరి. ఇంతవఱకును విద్యాబోధకవృత్తిని ఋజుమార్గమున నుండిన నే నిపు డీక్రొత్త యుద్యోగమునఁ జేరుట యుక్తము కాదని, మార్గమధ్యమున గాకినాడలో నాయఁడుగారు మాకు నచ్చఁజెప్పిరి. కావున నేను మనసు మార్చుకొంటిని.

1911 జనవరినెల తుదిని గుంటూరులో "విద్యావిషయక సభలు" జరిగెను. పలుచోట్లనుండి విద్యార్థులు చేసిన వస్తువులు తెప్పించి, వానిని కళాశాలా భవనమునఁ బ్రదర్శించితిమి. సభలకుఁదగిన యేర్పాటులన్నియుఁ జేసితిమి. రెండవ సర్కిలులోని కృష్ణ, గుంటూరు, నెల్లూరు మండలములనుండి వచ్చిన నూఱులకొలఁది బోధకులకు వసతిగృహము లేర్పాటు చేసితిమి. ప్రదర్శనమునకు వచ్చెడి యుపాధ్యాయులకు భోజనసౌకర్యమును జేయుటకు పాలక సంఘమువారు మొదట సమ్మతింపలేదు. ఇట్టి సౌకర్యము లున్నఁగాని సభ జయప్రదముగ జరుగదని ఏకారామయ్యగారు నేనును గట్టిపట్టు పట్టుటచేత, మాపంతము నెగ్గెను. కాని యీభోజనసదుపాయము గలిగించు భారము మా యిరువురిమీఁదను బడెను. రామయ్యపంతులుగారు సాహసముగలవాఁడు. గొప్పసమావేశములకుఁ దగిన యేర్పాటులు చేయుటయం దాయన సమర్థుఁడు. అంత మావిధులను మేము సక్రమముగఁ జెల్లించితిమి.

1911 జనవరి 24 నుండి 28 వ తేదీవఱకును బహిరంగ సభలు, ప్రదర్శనమును జరిగెను. సమర్థు లయినవారు సభలలో నుప