పుట:2015.373190.Athma-Charitramu.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 484

1909 వ సంవత్సరమున దొరతనము వారి తెలుఁగు ట్రాన్సులేటరగు సమర్థిరంగయ్య సెట్టిగారు రైలుప్రమాదమున మరణింపఁగా, ఆయుద్యోగము ఖాళీ యయ్యెను. నన్నీపనికి దరఖాస్తు చేయుఁడని మిత్రులు ప్రోత్సహించుటచేత, జూలై నెలలో నేను అర్జీ నంపితిని. కళాశాలాధ్యక్షులు ఊల్ దొరగారును, పరీక్షాధికారులు గరికిపాటి సుబ్బారాయఁడు శాస్త్రిగారును నాకు గట్టి సిఫారసులు చేసిరి. వీరేశలింగముగారును, కిళాంబి రామానుజాచార్యులుగారును నన్ను గుఱించి సర్టీఫికేటు లొసంగిరి.

అంత కొన్ని నెలలకు ధరఖాస్తుదారులలో నెల్లమిత్రుఁడు కనకరాజునుగూర్చియు, నన్నుగుఱించియు దొరతనమువారు సదభిప్రాయులై యుండిరనియును, ఈతరుణమున నుదకమండలము వెళ్లి స్వయముగ నధికారులఁ జూచినచో నాకు లాభము గలుగుననియును స్నేహితులు చెప్పుటచేత, నేను గుంటూరునుండి బయలుదేఱితిని. నే నిదివఱ కెపుడును నీలగిరులు చూచియుండలేదు. ఇపుడు శీతకాలము సమీపించుటచేత, నేనచటనుండిన రెండు మూఁడు దినములును రాత్రులందు ఉదకమండలము ఉదకమండలమె యయ్యెను. అచ్చటి గొప్ప యుద్యోగస్థులకు నేను సిఫారసు ఉత్తరములు పట్టుకొని వెళ్లితిని. తక్కినవారినిగూడఁ జూచితిని. వారందఱు సుహృద్భావముఁ జూపిరి. అందఱికంటె నెక్కువగ శ్రీ గాలట్టీదొరగారు మనసిచ్చి నాతోమాటాడిరి. ఆయన దొరతనమువారికి 'అండరుసెక్రటరీ'. ఆయన నాతో నాంధ్రసారస్వతమును గూర్చి ముచ్చటించి, నన్నుగుఱించియు కనకరాజునుగూర్చియుఁ దమకు సదభిప్రాయము కలదని చెప్పిరి. నేను మంచి జీతము తెచ్చుకొని కళాశాలలో గొప్పయుద్యోగము చేయు చుండఁగా, నామిత్రుఁడు కనకరాజు అంగవైకల్యమునొంది న్యాయ