పుట:2015.373190.Athma-Charitramu.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 470

గానవచ్చి. ఆమె మరణించెను. అవసానసమయమున నీశ్వరనామమును వట్టి యూఁతపదముగఁగాక, ప్రాణపదమగు పవిత్రనామముగఁ జేకొని, జీవితమును విడనాడిన దన్యజీవిత యీ సుదతియని మాకు స్పష్టమయ్యెను.

మాతలిదండ్రులకుఁగల తారతమ్య మిట సంగ్రహముగఁ దెలిపెదను. తండ్రి నిష్కపటుఁడు, హాస్యవచనధోరణిగల వాచాలుఁడు. తల్లియన్ననో, నిగ్రహనిదానములు గల మితభాషిణి. మాజనకుఁడు పొంగారెడి హృదయమున మమ్ముఁ బ్రేమించువాఁడు. మేము నటులే యాయనను బ్రేమించువారము. కాని, యెక్కువ చనవున నొక్కొక్కప్పుడు మే మాయనను జులుకనగఁ జూచుచుండువారము. మాతల్లిపట్ల యట్లుగాదు. ఆమెయెడ మాకుఁగల ప్రేమ భయభక్తులతోఁ గూడియుండునది. ఆమె మా కెంత ప్రేమాస్పదయైనను, మే మామెతో కోఁతికొమ్మచ్చియాట లాడరాదు. అడ్డు వచ్చిన చెట్ల చేమల నెల్లను తనప్రవాహ వేగమునఁ గొట్టివేయునట్టి పర్వత ప్రాంతమందలి సెలయేరువంటిది మాజనకిని ప్రేమము. ప్రేమయం దాయనహృదయ మిచ్చెడివాఁడు. పిల్లల కెవరికైన తీవ్రవ్యాధి సోఁకినచో, శిశువువలె విలపించి, వలసినచో తనయసువుల నర్పింపఁ జూచుచుండువాఁడు. బాలికవలె జాలిగుండెగలవాఁడు. స్వచ్చమును, స్పష్టమును నైన యనురాగము చూపుచుండువాఁడు. మా కెఱుకఁ బడనిలోపము లాయనయందు లేనేలేవు. ఆయన వైపరీత్యములు వైకల్యములును ప్రస్తావించి, మే మెత్తిపొడుచుచుండువారము.

కాని, మాతల్లివిషయ మట్టిది గాదు. ఆమె నిశ్చలబుద్ధియగు ధైర్యవతి. ఆమెకును సుహృదయము లేకపోలేదు. ఐనను, మాతండ్రికిఁ గల భావసంపదయు, భావవైపరీత్యములును గూడ నామె