పుట:2015.373190.Athma-Charitramu.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. జననీ సంస్మరణము 469

సుగుణవతి యెంచెను. ఆమె కింతటితోనే సంతృప్తి ! ఇంతకంటె నేమియు పుడమియం దా పుణ్యవతి కక్కఱలేదు !

ఈసమయమున నాధర్మశీల యాలోచనలన్నియు దైవమును గుఱించినవియె. జీవితమునఁ దనకు పరమాప్తుఁడును, ఇపుడు పరమావధియు నైన పరమాత్ముని మీఁదికే మాతల్లి తనదృష్టి నిగిడ్చెను. ఆపద్బాంధవుఁడని దేవునిపాదకమలము లామె యిపు డాకస్మికముగ పట్టుచుండలేదు. భూలోకమునఁ దన విధ్యుక్తములను నెరవేర్చి, భవభారమున నలసినజీవి పరమాత్మను జేరునట్టుగ, నాపుణ్యవతి తన పాటలు పద్యములను పాడుకొనుచుండెను.

ఆవ్యక్తియొక్క ప్రశాంతమనస్సు, సమబుద్ధి, సమధిక భక్తియును, ఈ యంత్యరంగశోభను మఱింత వృద్ధిచేసెను. కాని, వెను వెంటనే మరణము సంభవింపలేదు. ననులుమోడ్చి యాకాంత భగవన్నామసంకీర్తనము చేసికొనుచుండెను. ఆమెచెవిలో నీశ్వరనామము మేము పలుకఁగా, 'నారాయణ' అని యామె మాఱుపలికెను. ఆసమయమున నామనస్సునఁదోఁచిన పాపపుఁదలంపు నొకటియచటఁ బేర్కొనుచున్నాను. ఆమెమరణమునకు మంచి తరుణమిదియే గదాయని నే ననుకొంటిని. తనయుఁడనగు నేను తల్లిచావును గోరితినే యని నే నంత నొచ్చుకొంటిని.

నావలెనే మాతమ్ములును దలపోయసాగిరి. ఈశ్వరధ్యాన నిమగ్నయై యుండునపు డీజీవికి మృత్యు వాసన్న మగుట పుణ్యము గదాయని మే మనుకొంటిమి. కాని, యామె యింకనొకరోజు జీవించునటులఁ దోఁచెను. ఇంతలో నామె నిద్దురపోవునటు లుండెను. కొలఁది నిముషములలోనే యొకటి రెండు మాఱులు దీర్ఘనిశ్వాసములు