పుట:2015.373190.Athma-Charitramu.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. పర్లాకిమిడిలో ప్రథమదినములు 433

రాజుగారికి వార్త నంపిరి. అపు డాపూరియింట కప్పు కొంత తొలఁగించి, పైనుండి తుపాకిపేల్చి, రాజుగారు పులిని జంపివేసిరి ! నే నీపురమునఁ బాదము పెట్టఁగనే నన్ను వ్యాధి వేధించుటయు, ఇచట నటవీ మృగములు బాహాటముగ సంచారముచేయుటయుఁ జూడఁగా, ఇందలి నివాసము నాకు బొత్తిగ సరిపడకుండునట్లు తోఁచెను ! కావున నిచ్చటినుండి మొదటనే ధైర్యముతో వెనుకంజ వేయుట కర్తవ్యము కాదా యని తమ్ముఁడు నేనును దలపోసితిమి ! కాని సాధకుఁడగు పాత్రుఁడును పేరుగల యోఢ్రవైద్యుఁడు నాకు మంచిమం దిచ్చి, వ్యాధినివారణముఁ జేసెను. అంతట తమ్ముఁడు నన్నిక్కడ విడిచి రాజమంద్రి వెడలిపోయెను.

కళాశాలలో నే జెప్పవలసిన చదువు నా కమితప్రియమైనది. 'శారీరశాస్త్రము' కొంత క్రొత్తవిషయమైనను, పరిశ్రమముచేసి, మంచిపుస్తకములు చదివి, అందుఁ గావలసిన పరిజ్ఞాన మలవఱచుకొంటిని. ఆంగ్ల సాహిత్యము నాకుఁ గొట్టినపిండియే. పరీక్షకుఁబోవు తరగతికావిషయము బోధించుటయందు నా కమితాసక్తి. పాఠశాలలోనివారు నాకు వేగమే మిత్రులైరి. అధ్యక్షుఁడు శ్రీనివాసరావుగారు సాధుపుంగవుఁడు. ఈయన సహాయాధ్యాపకుల జోలికేమియుఁ బోక, స్వేచ్ఛానందములతో వారిపనులు వారిని జేయనిచ్చు చుండువారు. పై యధికారియం దట్టి సుగుణ మమూల్యమని నేను గ్రహించితిని. శ్రీగిడుగు రామమూర్తిపంతులుగారు తమ యభిమాన విద్యయగు చరిత్రమున మిన్నలు. రాజకుమారుల గురువులును, కళాశాల తరగతులలో నాంగ్లోపన్యాసకులు నగు కాండ్లరుదొర మితభాషియగు సుజనుఁడు. స్నేహపాత్రులును విద్యాశాలలో ప్రకృతి శాస్త్రోపాధ్యాయులునునగు శ్రీ సుందరరామయ్యగా రిదివఱకే రాజ